Akshay Kumar : షూటింగ్ లో ప్రమాదం.. స్టార్ హీరోకు పెద్దపెద్ద గాయాలు.. ఎవరికంటే?

సాధారణంగా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో హీరో హీరోయిన్ లకు నటీనటులకు గాయాలవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది.అయితే ఈ మధ్యకాలంలో ఇలా షూటింగ్ లు జరుగుతున్న సమయంలో హీరో హీరోయిన్లు గాయపడిన ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

 Akshay Kumar Injured Sets Bade Miyan Chote Miyan Scotland-TeluguStop.com

మొన్నటికి మొన్న లవ్ టు డే సినిమా( Love To Day movie ) హీరోయిన్ కి ప్రమాదం జరిగి ముఖానికి గాయాలు అయిన విషయం తెలిసిందే.అలాగే హీరోయిన్ సమంతకు, హీరో విశాల్ కు కూడా షూటింగ్ జరుగుతున్న సమయంలో గాయాలు అయ్యాయి.

Telugu Akshay Kumar, Bademiyan, Bollywood, Prithviraj, Samantha, Sukumaran, Vish

ఇది ఇలా ఉంటే తాజాగా మరో స్టార్ హీరో కూడా షూటింగ్లో గాయపడినట్లు తెలుస్తోంది.బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో షూటింగ్లో గాయపడినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఆ స్టార్ హీరో మరెవరో కాదు అక్షయ్ కుమార్( Akshay Kumar ).బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్షయ్‌ కుమార్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అక్షయ్ బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్కాట్లాండ్ లో జరుగుతోంది.ఫుల్ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో హీరో అక్షయ్ కుమార్ గాయపడినట్లు తెలుస్తోంది.

Telugu Akshay Kumar, Bademiyan, Bollywood, Prithviraj, Samantha, Sukumaran, Vish

ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌( Action sequence ) సీన్లు చేస్తున్న సమయంలో అక్షయ్ గాయపడినట్లు తెలుస్తోంది.ఓ ఫైట్‌ కోసం స్టంట్ చేస్తుండగా అతని మోకాలికి గాయమైనట్లు సమాచారం.కాగా హీరో అక్షయ్ గాయపడినప్పటికీ షూటింగ్‌ ని అలాగే కొనసాగించారని చిత్రబృందం వెల్లడించారు.అయితే అందుకు సంబంధించిన ఫోటోలను బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన మీనాక్షి సిన్హా( Meenakshi Sinha ) నటిస్తుండగా పృథ్వీరాజ్( Prithviraj ) సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమాతో పాటు అక్షయ్ కుమార్ ఇంకా నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube