Akshay Kumar : షూటింగ్ లో ప్రమాదం.. స్టార్ హీరోకు పెద్దపెద్ద గాయాలు.. ఎవరికంటే?

సాధారణంగా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో హీరో హీరోయిన్ లకు నటీనటులకు గాయాలవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది.

అయితే ఈ మధ్యకాలంలో ఇలా షూటింగ్ లు జరుగుతున్న సమయంలో హీరో హీరోయిన్లు గాయపడిన ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

మొన్నటికి మొన్న లవ్ టు డే సినిమా( Love To Day Movie ) హీరోయిన్ కి ప్రమాదం జరిగి ముఖానికి గాయాలు అయిన విషయం తెలిసిందే.

అలాగే హీరోయిన్ సమంతకు, హీరో విశాల్ కు కూడా షూటింగ్ జరుగుతున్న సమయంలో గాయాలు అయ్యాయి.

"""/" / ఇది ఇలా ఉంటే తాజాగా మరో స్టార్ హీరో కూడా షూటింగ్లో గాయపడినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో షూటింగ్లో గాయపడినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు అక్షయ్ కుమార్( Akshay Kumar ).

బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్షయ్‌ కుమార్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అక్షయ్ బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్కాట్లాండ్ లో జరుగుతోంది.ఫుల్ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో హీరో అక్షయ్ కుమార్ గాయపడినట్లు తెలుస్తోంది.

"""/" / ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌( Action Sequence ) సీన్లు చేస్తున్న సమయంలో అక్షయ్ గాయపడినట్లు తెలుస్తోంది.

ఓ ఫైట్‌ కోసం స్టంట్ చేస్తుండగా అతని మోకాలికి గాయమైనట్లు సమాచారం.కాగా హీరో అక్షయ్ గాయపడినప్పటికీ షూటింగ్‌ ని అలాగే కొనసాగించారని చిత్రబృందం వెల్లడించారు.

అయితే అందుకు సంబంధించిన ఫోటోలను బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన మీనాక్షి సిన్హా( Meenakshi Sinha ) నటిస్తుండగా పృథ్వీరాజ్( Prithviraj ) సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాతో పాటు అక్షయ్ కుమార్ ఇంకా నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

నోటి దూల కారణంగా కోటి రూపాయలు నష్టపోయిన తేజ..??