ఎయిర్ ఇండియా అనగానే మనకి టాటా గ్రూప్ గుర్తుకు వస్తుంది.ఎందుకంటే దీనిని స్టార్ట్ చేసింది వారే కనుక.
అయితే ముఖ్య విషయం ఏమంటే, ఎయిర్ ఇండియా తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.ఇది ఎవ్వరూ ఊహించనిది.
అవును, తన పేరు మార్చుకోబోతున్నట్లు తాజాగా వెల్లడించింది.అయితే టాటా గ్రూప్ కొత్త పేరు ఏంటో కూడా చెప్పేసింది.
ఇకపై ఎయిర్ ఇండియా పేరు Vihaan.AIగా మారబోతోంది.
భారతీయ మూలలతో ప్రపంచ స్థాయి గ్లోబల్ ఎయిర్‌లైన్‌గా మరోసారి సత్తా చాటేందుకు, స్థిరపడేందుకు సమగ్రమైన ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్‌ను ఆవిష్కరించింది.కొత్త ప్రణాళికలలో భాగంగా ఎయిర్ ఇండియా తన నెట్‌వర్క్, ఫ్లీట్ రెండింటినీ మరింత వృద్ధి చేయనుంది.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రతిభతో రాణించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.వచ్చే ఐదేళ్లలో అధిక మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతోంది.రాబోయే 5 సంవత్సరాలలో ఎయిర్ ఇండియా దేశీ మార్కెట్‌లో తన వాటాను కనీసం 30% పెంచుకోవడానికి యత్నిస్తోంది.ప్రస్తుతం ఇది 8% మాత్రమే ఉంది.
అదే సమయంలో ప్రస్తుత మార్కెట్ వాటాలో అంతర్జాతీయ సర్వీసులను గణనీయంగా పెంచుకోవాలని చూస్తోంది.ఎయిర్ ఇండియా తన ఉద్యోగుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజాగా ఈ విషయం వారు స్పందిస్తూ… ఒకప్పుడు ఎంతటి ఘన కీర్తిని ఎయిర్ ఇండియా కలిగి ఉందో.మళ్లీ ప్రపంచ పటంలో ఎయిర్ ఇండియాకు అదే స్థానాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు.
కాగా ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం గతంలో టాటాల నుంచి ఎయిర్ ఇండియాను తీసుకొని జాతికి అంకితం చేసింది.
మళ్లీ తర్వాత ఎయిర్ ఇండియా సొంత గూటికి చేరింది.ఇప్పుడు ఏకంగా కంపెనీ పేరును మార్చబోతోంది.
కొత్త ప్రణాళికతో దూసుకుపోనుంది.