అఖిల్ ఏజెంట్( Agent ) థియేటర్లలో రిలీజ్ కావడానికి ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది.ఏ సెంటర్ ప్రేక్షకులను టార్గెట్ చేసి తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాతో సాక్షి వైద్య టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.మహారాష్ట్రలోని ఠాణె ప్రాంతంలో 2000 సంవత్సరంలో ఈ బ్యూటీ జన్మించారు.
చదువు పూర్తైన తర్వాత ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత రోజుల్లో పలు యాడ్స్ లో నటించారు.మోడల్ గా కూడా కెరీర్ ను కొనసాగించిన సాక్షి వైద్య( Sakshi Vaidhya ) ఏజెంట్ సినిమాతో గ్లామర్ హీరోయిన్ గా సత్తా చాటుతారేమో చూడాలి.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే సాక్షి వైద్య స్టార్ హీరోయిన్ అవుతారని ఫ్లాప్ అయితే మాత్రం సాక్షి వైద్య కెరీర్ క్లోజ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇండస్ట్రీలో
అఖిల్( Akkineni Akhil )
కు జోడీగా నటించిన హీరోయిన్లకు కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదని టాక్ ఉంది.సాక్షి వైద్య అయినా ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అఖిల్ కెరీర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్( Most Eligible Bachelor ) మాత్రమే హిట్ కాగా ఈ సినిమా కూడా కమర్షియల్ గా భారీ స్థాయిలో అద్భుతాలు అయితే చేయలేదనే సంగతి తెలిసిందే.
అనిల్ సుంకర( Anil Sunkara )45 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఏజెంట్ సినిమాను నిర్మించాలని భావించగా వేర్వేరు కారణాల వల్ల సినిమా రిలీజ్ సమయానికి బడ్జెట్ లెక్కలు మారిపోయాయి.దాదాపుగా రెండేళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ ను జరుపుకోవడం గమనార్హం.
ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ కానున్న ఏజెంట్ అభిమానుల అంచనాలను మించి ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.సాక్షి వైద్య కెరీర్ ను అఖిల్ ముంచుతాడో తేల్చుతాడో చూడాల్సి ఉంది.