శ్రీరామ నవమికి 'ఆదిపురుష్‌' గిఫ్ట్‌ ఏంటో తెలుసా?

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నాడు.అద్బుతమైన సక్సెస్‌ లను దక్కించుకుంటూ బాలీవుడ్‌ లో జెండా పాతాడు.

 Pan India Movie Adipurush Movie First Look For Srirama Navami , Adipurush, Prabh-TeluguStop.com

ఇలాంటి సమయంలో ప్రభాస్‌ డైరెక్ట్‌ హిందీ సినిమా కోసం అక్కడి అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు హిందీలో ఆదిపురుష్‌ తో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రభాస్‌ రెడీ అయ్యాడు.

ఓమ్‌ రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో ప్రభాస్‌ రాముడిగా నటిస్తుండగా రావణుడి పాత్రను సైఫ్‌ అలీ ఖాన్‌ చేస్తున్నాడు.ఇక ఈ సినిమా లో సీత పాత్రను కృతి సనన్‌ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్ ను శ్రీరామ నవమి సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దర్శకుడు ఓం రౌత్‌ తాజాగా ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

ప్రభాస్ తో వర్క్‌ చేయడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చిన ఓమ్‌ రౌత్‌ శ్రీరామ్‌ నవమి సందర్బంగా సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుద లచేయడంతో పాటు ప్రేక్షకులకు సర్‌ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.రామాయనం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుసు.

కాని రాముడిగా ప్రభాస్ ను ఇప్పటి వరకు ఎవరు చూపించని విధంగా చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు.కనుక ఈ సినిమా లో ప్రభాస్ లుక్‌ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

శ్రీరామ నవమికి రాముడిగా ప్రభాస్ లుక్ తో పాటు సీత దేవి లుక్ ను కూడా ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అం టున్నారు.మరింత సమాచారం అతి త్వరలోనే రాబోతుంది.ఆది పురుష్‌ 500 కోట్ల భారీ బడ్జెట్‌ తో విజువల్‌ వండర్ గా రూపొందుతున్న విషయం తెల్సిందే.300 కోట్లకు పైగా బడ్జెట్‌ ను విజువల్‌ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు చేస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube