50 వేల రూపాయలు పెట్టి ఆ క్రీమ్ కొన్నాను.. టబు షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో టబు ఒకరు.తెలుగులో నాగార్జున టబు కలిసి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

 Actress Tabu Comments About Glamour Secret Details Here Goes Viral , Actress Tab-TeluguStop.com

తాజాగా టబు ఒక ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.హీరోయిన్ టబు తన గ్లామర్ సీక్రెట్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అందంగా ఉండటం కోసం తాను 50,000 రూపాయల ఫేస్ క్రీమ్ ను కొనుగోలు చేశానని ఆమె తెలిపారు.

అయితే ఆ ఫేస్ క్రీమ్ ను ఒకసారి మాత్రమే కొనుగోలు చేశానని ఆ తర్వాత ఆ క్రీమ్ ను వాడలేదని టబు చెప్పుకొచ్చారు.

మేకప్ ఆర్టిస్ట్ సలహా మేరకు తాను ఒకే ఒకసారి ఆ క్రీమ్ ను కొనుగోలు చేయడం జరిగిందని ఆ తర్వాత తాను ఎప్పుడూ ఫేస్ క్రీమ్ ను కొనుగోలు చేయలేదని, ఫేస్ వాష్ చేయించుకోలేదని ఆమె చెప్పుకొచ్చారు.భూల్ భూలయ్యా2 సినిమాతో టబు భారీ సక్సెస్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం టబు హిందీ దృశ్యం2 సినిమాలో నటిస్తున్నారు.అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో టబు ఖాతాలో మరో సక్సెస్ గ్యారంటీ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వయస్సు అంతకంతకూ పెరుగుతున్నా టబు గ్లామర్ ఏ మాత్రం తగ్గడం లేదు.టబుకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు ఎక్కువ సంఖ్యలోనే వస్తున్నాయని సమాచారం అందుతోంది.

Telugu Actress Tabu, Bhool Bhoolaiya, Secret-Movie

అల వైకుంఠపురములో సినిమాలో నటించిన పాత్ర వల్ల టబుకు మంచి పేరు వచ్చిందనే విషయం తెలిసిందే.టబు 50 సంవత్సరాల వయస్సులో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.టబు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.సోషల్ మీడియాలో టబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube