Actor Suresh Gopi : జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించిన నటుడు.. ఆపై క్షమాపణలు చెబుతూ అలాంటి ట్వీట్?

భారతీయ సినీ నటుడు సురేష్ గోపీ( Suresh Gopi ) గురించి తెలిసిందే.సురేష్ గోపి కేవలం నటుడు మాత్రమే కాదు.

 Actor Suresh Gopi Apologizes To Woman Journalist For His Inappropriate Behavior-TeluguStop.com

మాజీ ఎంపీ, గాయకుడు కూడా.కాగా ఆయన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల చిత్రాల్లో నటించాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈయన పేరు మారుమోగుతోంది.అసలేం జరిగిందంటే.

కేరళలోని కోజికోడ్‌లో శుక్రవారం రోజు జర్నలిస్టుల ప్రశ్నలకు( Journalists Questions ) సమాధానమిస్తూ మహిళా విలేకరి భుజంపై రెండుసార్లు చేయి వేసి ఆమెతో సంభాషించడంపై వివాదం చెలరేగింది.మొదట మహిళా విలేకరికి సమాధానం చెబుతూ.

ఆమె భుజంపై చెయ్యి వేశారు.ఆయన ప్రవర్తనతో ఇబ్బందిపడిన ఆమె కాస్త దూరం జరిగింది.

అయినప్పటికీ అతను తన ప్రవర్తనను మార్చుకోకపోగా కొంత సమయం తర్వాత ఆమె మరో ప్రశ్న అడిగేందుకు ముందుకు రాగా.ఆయన మరోసారి ఆమెను అదే విధంగా తాకారు.ఆ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో ఈ ఘటనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో మాజీ ఎంపీ సురేష్ గోపి నేడు సదరు జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు.

ఒక మహిళా జర్నలిస్ట్‌( Female Journalist )తో ఆయన ప్రవర్తించిన తీరు దేశం అంతటా చర్చనీయాంశంగా మారింది.దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ చేశారు.

ఆమెను నేనొక కుమార్తెగా భావించాను.ఆ ఆప్యాయతతోనే భుజంపై చెయ్యి వేశాను.ఈ ఘటన పట్ల ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను.నా ప్రవర్తన వల్ల ఆమె ఇబ్బందిపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నాను అని ఆయన తెలిపారు.కాగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్( Suresh Gopi Apology Tweet ) అవ్వడంతో కొందరు ఆయనను సమర్థిస్తుండగా మరికొందరు తిట్టిపోస్తున్నారు.ఆయన తప్పుగా ప్రవర్తించలేదు ఆయన కూతురిగా భావించి వేశానని అన్నారు.

కానీ చూసే జనం మాత్రం దానిని తప్పుగా అనుకున్నారు అనుకో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube