ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry )లో సీనియర్ హీరోలు యంగ్ హీరోలతో పోటీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.60 ఏళ్లు దాటినా కూడా వాళ్లు 30 ఏళ్ల కుర్రాళ్ళు లాగా కనిపిస్తున్నారు.అసలు ఈ వయసులో కూడా వాళ్ళు అంత యంగ్ గా కనిపించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఇప్పటికే నాగర్జున, చిరంజీవి, బాలయ్య ఇలా మరి కొంతమంది సీనియర్ హీరోలు ఎంత ఎనర్జీ గా కనిపిస్తున్నారో చూస్తూనే ఉన్నాం.
ఇక వీళ్ళతోపాటు జగపతిబాబు కూడా లైన్లో ఉన్నాడని చెప్పాలి.
కెరీర్ మొదట్లో ఎలా ఉన్నాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు జగపతిబాబు( Jagapathi Babu ). అప్పటికి ఇప్పటికీ తనలో వచ్చిన మార్పు ఏదో కాదు స్టైల్ మాత్రమే.తన బాడీ అలాగే ఉన్నప్పటికీ కూడా తన లుక్ మాత్రం బాగా చేంజ్ అయింది.
ఏకంగా బాలీవుడ్ హీరో లాగా కనిపిస్తూ ఉంటాడు.అయితే తాజాగా తను ఒక ఫోటో షేర్ చేసుకోగా ఆ ఫోటో చూసి కుర్ర హీరోలు సైతం కుళ్ళుకునే విధంగా చేస్తాడని చెప్పాలి.
ఇంతకు ఆ ఫోటోలో ఎలా ఉన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
జగపతిబాబు తొలిసారిగా 1992లో అసాధ్యులు సినిమా( Asadhyulu )తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఆ తర్వాత గాయం, జాబిలమ్మ పెళ్లి, దొంగాట వంటి సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకొని వెనుతిరగకుండా వరుస సినిమాలలో నటించాడు.ఇక మధ్యలో కొన్ని ఏళ్ళు ఇండస్ట్రీకి దూరమైన జగపతిబాబు మళ్లీ రీ ఎంట్రీ తో వయసుకు తగ్గ పాత్రలనే కాకుండా విలన్ పాత్రల్లో కూడా నటించాడు.ఒక హీరోగానే కాకుండా హీరో హీరోయిన్స్ కు తండ్రిగా, విలన్ పాత్రగా కూడా జగపతి బాబు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు.
విలన్ పాత్ర( Jagapathi Babu Villain Role )తో కూడా అందర్నీ మెప్పిస్తూ వరుసగా అవే అవకాశాలు అందుకుంటున్నాడు.ఇక ఇప్పటికీ జగపతిబాబు లుక్ ఏం మాత్రం మారలేదు.
ఈమధ్య బాగా వర్కౌట్లు కూడా చేస్తున్నాడు.ఇక ఈయన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.
వరుసగా ఫోటోలు కూడా పంచుకుంటూ ఉంటాడు.అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడు.
అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్( Instagram ) లో ఒక పిక్ షేర్ చేసుకున్నాడు.అందులో తను ఎల్లో కలర్ కోట్, గ్రీన్ కలర్ షూ, తెలుపు రంగులో ఉన్న గడ్డంలో లుక్ లో గాగుల్స్ పెట్టుకొని సోఫాలో కూర్చొని హ్యాండ్సమ్ గా కనిపించాడు.చాలా స్టైల్ గా కూడా ఉన్నాడు.ఇక తన ఫోటోకు తానే ట్రోల్ చేసే విధంగా కామెంట్ పెట్టుకున్నాడు.పసుపుపచ్చ…ఆకుపచ్చ…ఏంట్రా ఈ రంగులు.ఏమైనా రంగులరాట్నం అనుకుంటున్నావా అని తనను తానే కామెంట్ చేసుకున్నాడు.
ఇక ఆ ఫోటో చూసి నెటిజన్స్ మాత్రం ఫిదా అవుతున్నారు.మిమ్మల్ని చూసి ఈ తరం యంగ్ హీరోలు కుళ్ళు కోవటం ఖాయం అని కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియా( Social Media )ను షేక్ చేస్తుంది.