అరటి సాగులో పనామా కుళ్ళు తెగుల నివారణకు చర్యలు..!

అరటి సాగును( Banana ) ఆశించే పనామా కుళ్ళు తెగులు ఒక ఫంగస్ వల్ల వ్యాప్తి చెందుతుంది.భూమి లోపల కొన్ని దశాబ్దాల పాటు ఈ ఫంగస్ జీవించే ఉంటుంది.

 Actions To Prevent Panama Cullu Pest In Banana Cultivation , Banana Cultivation-TeluguStop.com

అరటి మొక్క వేర్ల ద్వారా చెట్టు లోపలికి ప్రవేశిస్తుంది.ఈ ఫంగస్ నీటి ద్వారా, పనిముట్ల ద్వారా, పాదరక్షల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది.

ఉష్ణోగ్రత పెరిగితే ఈ తెగుల వ్యాప్తి కూడా పెరుగుతుంది.ఈ తెగుళ్ల ప్రధాన పాత్ర ఏమిటంటే పోషకాలు అందించే కణజాలాలను ఎండిపోయేటట్టు చేయడం.

అలా చేస్తే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి.తొలి దశలో ఈ తెగులను అరికట్టకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవలసిందే.

Telugu Agriculture, Banana, Latest Telugu, Pest Resistant, Temperature, Trichode

అరటి చెట్లు ముదురు పసుపు రంగులోకి మారి వాడిపోతే ఆ చెట్లకు తెగులు సోకినట్లు నిర్ధారించుకోవాలి.పసుపు రంగులోకి మారిన ఆకులు క్రమంగా చీలిపోవడం, ఎండిపోవడం జరుగుతుంది.మరి ఈ తెగులు ఎలా నివారించాలో చూద్దాం.మార్కెట్లో అధికంగా నకిలీ విత్తనాల దందా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.కాబట్టి సర్టిఫైడ్ కంపెనీ నుంచి తెగులు నిరోధక మొక్కల( Pest resistant plants ) రకాలను ఎంచుకోవాలి.పొలంలో నీరు నిల్వ ఉండకుండా నీటిపారుదల వ్యవస్థను చక్కగా ఏర్పాటు చేసుకోవాలి.

తెగులు సోకిన మొక్కలను పంట నుండి వేరు చేసి వెంటనే కాల్చి నాశనం చేయాలి.పొలంలో ఉపయోగించే పనిముట్లను హైపోక్లోరైడ్ తో శుద్ధి చేయాలి.

Telugu Agriculture, Banana, Latest Telugu, Pest Resistant, Temperature, Trichode

ఒకవేళ అరటి పంటకు ఈ తెగులు సోకినట్లయితే, ఓ మూడు సంవత్సరాల పాటు తెగులు సోకిన భూమిలో అరటి పంట వేయకుండా ఇతర పంటలు వేసుకోవాలి.సేంద్రీయ పద్ధతిలో ఈ తెగులను నివారించాలి అంటే ట్రైకోడెర్మా వీరిడే( Trichoderma ) లాంటి ఫంగస్ లేదంటే సుడోమోనాస్ ఫ్లోరెసిన్స్ లాంటి బ్యాక్టీరియా జీవ నియంత్రణ పదార్థాలు ఉపయోగించి ఈ తెగులను అరికట్టవచ్చు.రసాయన పద్ధతిలో కార్బమ్ డిజమ్ 50.0wp తో మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసి ఈ తెగులను అరికట్టవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube