చైనాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం విచిత్ర నిర్ణయం తీసుకుంది.
విదేశాల నుంచి చైనా వచ్చే వారికి క్వారెంటెయిన్ నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేసింది.కాగా జనవరి 8 నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది.
అయితే చైనా కొత్త సంవత్సరం సందర్భంగా భారీగా ప్రయాణాలు ఉండనున్నాయి.ఇందులో భాగంగానే జనవరి రెండో వారం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు గ్రామాలకు వెళ్లనున్నారు.
సరిగ్గా అదే సమయంలో క్వారెంటెయిన్ నిబంధనను సర్కార్ ఎత్తివేసింది.దీంతో కొత్త వేరియంట్లూ గ్రామాలకు సైతం వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
జనవరి చివరి వారం నాటికి కరోనా మహోగ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.
ఇప్పటికే చైనాలో ఒమిక్రాన్ దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్న విషయం తెలిసిందే.
ఆస్పత్రుల్లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తుండగా అటు శ్మశానాల దగ్గర కలచివేసే పరిస్థితులే ఉన్నాయి.ఒమిక్రాన్ మారణ హోమంతో చైనీయులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నా ప్రభుత్వ వైఖరి మాత్రం మారడం లేదని చెప్పొచ్చు.