తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి నటుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే కమర్షియల్ సినిమాలకు కొత్త హంగులను అద్దిన హీరో చిరంజీవి… ఇక అప్పటివరకు మూస ధోరణిలో ఉన్న తెలుగు సినిమాని ఒక్కసారిగా కొత్త పుంతలు తొక్కించి సినిమా అంటే ఇలా ఉండాలి, హీరో అంటే ఇలాంటి సాహసాలు చేయాలి అని చేసి చూపించిన నటుడు చిరంజీవి.
ఇక ఇప్పుడు చిరంజీవి( Chiranjeevi ) కి పద్మ విభూషణ్( Padma Vibhushan ) పురస్కారం కూడా దక్కాం అనేది నిజంగాగ్రీట్ అనే చెప్పాలి.
ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి లాంటి నటుడికి ఎన్ని పురస్కారాలు ఇచ్చిన తక్కువే అవుతుంది.ఎందుకంటే తన సినిమాలో నటుడు మాత్రమే కాకుండా పేద ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వస్తున్నాడు.ఇక ఇప్పటికే తను చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి.
ఇక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటివి స్థాపించి వాటి ద్వారా పేద ప్రజలకు ఎన్నో రకాల సేవలను కూడా అందిస్తున్నాడు.ఇక ఎన్నో ప్రాణాలను కూడా కాపాడిన ఘనత చిరంజీవికి దక్కుతుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం ఉన్న విశ్వంభర( Viswambhara ) అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ ఏజ్ లో కూడా తను రెస్ట్ తీసుకోకుండా కేవలం ఫ్యాన్స్ ని అలరించడం కోసమే సినిమాలు చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది…
.