తాజాగా విమాన ప్రయాణంలో కొందరు ప్రయాణికులు చాలా ఘోరంగా కొట్టుకున్నారు.తైవాన్ దేశం నుండి కాలిఫోర్నియా( California )కు వెళ్తున్న ఈవా ఎయిర్ కు చెందిన విమానంలో ఈ సంఘటన జరిగింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.విమానంలో ఓ ప్రయాణికుడు పక్కన మరో ప్రయాణికుడు తీవ్రంగా దగ్గుతూ ఉండడంతో అతను తన సీటు నుంచి లేచి మరో సీటులోకి వెళ్లి కూర్చున్నాడు.
అయితే కొద్ది సేపు తర్వాత మరో వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఈ సీటు నాది అంటూ గొడవకు దిగాడు.
అలా వచ్చిన అతడు సీటు తనదంటూ అక్కడి నుంచి కచ్చితంగా లేవాల్సిందేనంటూ గొడవ పెట్టుకున్నాడు.ఇద్దరు ఒకరికి ఒకరు పిడుగుద్దులు కొట్టుకునే అంతవరకు విషయం వెళ్ళింది.ఈ సమయంలో విమానం ( Fight )లోని అటెండెంట్ గొడవను చల్లార్చడానికి ఎంతో ప్రయత్నించిన వారు వినకుండా పెద్ద గొడవ చేశారు.
దాంతో విమానంలోని ప్రయాణికులు అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు.ఇక గొడవకు సంబంధించిన వీడియో తోటి ప్రయాణికుడు తన ఫోన్ కెమెరాలో బంధించి దానిని సోషల్ మీడియా>( Social media )లో పంచుకున్నాడు.
దాంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఖాళీగా ఉన్న సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు గొడవ పడ్డారంటూ అతడు సోషల్ మీడియాలో రాసుకోవచ్చాడు.ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఇలాంటి ప్రయాణికులను ఎట్టి పరిస్థితుల్లో విమానం లోపలికి రానివ్వకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు