ప్రేమ పెళ్లి పై స్పందించిన తమన్నా

మిల్కీ బ్యుటి తమన్నా అప్పుడే పెళ్ళి చేసుకోనుందా ? సినిమాలు త్వరలోనే మానేయబోతోందా ? త్వరలోనే పెళ్లి జరగబోతోందని, తమన్నా కూడా అసిన్ లాగానే ఒప్పుకున్న సినిమాలన్ని పూర్తి చేసి పెళ్ళి పీటలు ఎక్కే ఆలోచనలో ఉన్నట్లు బాలివుడ్ మీడియా తెగ రాసేస్తోంది.ఎవరో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని తమన్నా పెళ్లాడనున్నట్లు, అతను తమన్నా ఫ్యామిలి ఫ్రెండ్ అని, గత నాలుగు సంవత్సరాలుగా ఇద్దరికి పరిచయం ఉందని నిన్నటి రోజు తెగ హంగామా చేసేసింది నేషనల్ మీడియా.

 Tamannah Denies Getting Married-TeluguStop.com

అయితే ఇవన్ని ఉత్తుత్తి వార్తలే.అంతా గాలి కబుర్లే.

” ఇదేమి బాగాలేదు.నేను ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోను.

ఇంకా చాలా సమయం ఉంది దానికి.రూమర్స్ రాయడం ఆపెయ్యండి” అంటూ తన పెళ్ళి వార్తల మీద స్పందించింది తమన్నా.

అయినా ఇంత త్వరగా పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏముంది తమన్నాకి ! తెలుగు , తమిళంతో పాటు హిందీలో ఆఫర్లు కొట్టేస్తోంటే ఎంచక్కా !

ప్రస్తుతం తమిళంలో ధర్మదురై, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న “అభినేత్రి”, బాహుబలి – ది కంక్లుజన్ , హిందీలో రణవీర్ సింగ్ సినిమా … ఇవి తమన్నా చేతిలో ఉన్న ప్రాజెక్టులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube