టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్( Allu Arjun ) పేరే గట్టిగా వినిపిస్తోంది.ఇటీవల సంధ్య థియేటర్ ఘటనలో( Sandhya Theatre Incident ) భాగంగా అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్, కోట్లు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది.
రెండు మూడు రెండు వారాలుగా ఇదే విషయం కొత్త కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది.ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి సంబంధించి చాలా రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అందులో భాగంగానే అల్లు అర్జున్ పట్ల కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.అదేమిటంటే అల్లు అర్జున్ తన సినిమాలు వరుసగా సక్సెస్ అవ్వడంతో యాటిట్యూడ్ చూపిస్తున్నాడని, యాటిట్యూడ్ కూడా మారిపోయింది అంటూ గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం మాత్రం పెను వివాదానికి దారి తీసింది.
అప్పటి వరకూ కలిసిమెలిసి ఉన్న అల్లు, మెగా కుటుంబాల మధ్య వివాదాలకు, విభేదాలకు అది కారణమైందన్న వాదనా ఉంది.మొత్తం మీద అల్లు అర్జున్ నంద్యాల ప్రచారం తరువాత నుంచి అల్లు, మెగా అభిమానుల మధ్య వైరం తెరమీదకు వచ్చింది.మెగా అభిమానులు( Mega Fans ) అల్లు అర్జున్ కు దూరం అయ్యారు.
ఆ ప్రచారం పుష్ప2పై( Pushpa 2 ) తీవ్ర ప్రభావం చూపుతుందన్న అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తం అయ్యాయి.సినిమాపై ప్రభావం సంగతి పక్కన పెడితే ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాలలో ప్రచారం చేసిన నాటి నుంచి అల్లు అర్జున్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు.
అలాగే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట సంఘటనను వైసీపీ తనకు అంది వచ్చిన అవకాశంగా భావించి అల్లు అర్జున్ కు బాసటగా నిలిచింది.అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ వైసీపీ అధినేత జగన్( YS Jagan ) కూడా స్పందించారు.
అల్లు అర్జున్ కు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ఏపీలో మెగా ఫ్యామిలీ పరపతిని తగ్గించేందుకు, అలాగే కాపు ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి తనకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ నానా ప్రయత్నలు చేసింది.వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ అనుకూల, సొంత మీడియా కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా కథనాలు వండి వార్చింది.అల్లు అర్జున్ అరెస్టు వెనుక మెగా రాజకీయం ఉందన్న భావాన్ని ప్రజలలో నటేందుకు ప్రయత్నాలు చేసింది.
మరో వైపు తెలంగాణలో అధికారానికి దూరమై అసహనంతో ఉన్న బీఆర్ఎస్ కూడా అల్లు అర్జున్ అరెస్టు అంశాన్ని తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అంశంగానే భావించి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఆరోపణలనే గుప్పించింది.బీఆర్ఎస్ ట్రాప్ లో అల్లు అర్జున్ పడ్డారా అన్న అనుమానం కలిగే విధంగా అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ లో సంధ్యా ధియోటర్ తొక్కిసలాటకు కారణం జనాలను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యమే కారణం అన్నట్లుగా మాట్లాడారు.
అయితే పోలీసులు అల్లు అర్జున్ రోడ్ షో వీడియోలను విడుదల చేయడంతో ఆయన నేల మీదకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.పోలీసుల విచారణలో ఆయన తన తప్పు ఒప్పుకున్నారనీ, సారీ చెప్పారనీ వార్తలు వినవస్తున్నాయి.అదంతా పక్కన పెడితే ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ అత్యుత్సాహం ఆ పార్టీని ప్రజలలో మరింత పలుచన చేసిందని చెప్పాలి.ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టై విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడిన ఏ సందర్భంలోనూ ఆయన జగన్ ప్రస్తావన కానీ, వైసీపీ ప్రస్తావన కానీ తీసుకురాలేదు.
అంతే కాకుండా అల్లు అర్జున్ స్వయంగా చిరంజీవి( Chiranjeevi ) నివాసానికి, నాగబాబు ఇంటికి వెళ్లి మరీ తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ణతలు తెలిపి వచ్చారు.దీనిని బట్టే తన నంద్యాల ప్రచారం తొందరపాటేనని అల్లు అర్జున్ పరోక్షంగా అంగీకరించినట్లైంది.
అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీతో మరింత కలివిడిగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని తేటతెల్లం చేసింది.మరి ఇప్పటికైనా బన్నీ ఈ విషయాన్ని బాగా గమనిస్తే మేలని పలువురు హితవు పలుకుతున్నారు.