తెలుగు ప్రేక్షకులకు బాలయ్య బాబు( Balayya Babu ) తనయుడు మోక్షజ్ఞ( Mokshagna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య బాబు అభిమానులు కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు.ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే మోక్షజ్ఞ లుక్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక మోక్షజ్ఞ అప్పుడప్పుడు తండ్రి బాలకృష్ణ సినిమా సెట్స్ కి వెళ్తూ ఉంటాడు.
ఆ సెట్స్ నుంచి మోక్షజ్ఞ ఫొటోలు వచ్చి వైరల్ అవుతూ ఉంటాయి.మోక్షజ్ఞ పై వేరే హీరోలు, డైరెక్టర్స్ కూడా గతంలో కామెంట్స్ చేసారు.
బాబీ దర్శకత్వంలో( Director Bobby ) తెరకెక్కిన బాలకృష్ణ డాకు మహారాజ్( Daku Maharaj ) సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా డైరెక్టర్ బాబీ మోక్షజ్ఞపై ఆసక్తికర కామెంట్స్ చేసారు.సందర్భంగా బాబీ మాట్లాడుతూ.మోక్షజ్ఞ ఒక నాలుగు సార్లు సెట్ కి వచ్చారు.అతన్ని చూస్తే ఆరడుగులు, చాలా షార్ప్ ఫ్యూచర్స్, చాలా ఒదిగి ఉంటాడు, చాలా నేర్చుకోవాలని తపన ఉంటుంది.ఒక డైరెక్టర్ గా ఇలాంటి కుర్రాడు మనకి దొరికితే ఉంటుంది అనిపిస్తుంది.
అతనితో సినిమా తీయాలనే ఆశ ఉంటుంది.తీసే ఛాన్స్ వస్తే ఎవరూ వద్దనుకోరు.
మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే ఛాన్స్ అదే వస్తుంది అని అన్నారు.
దీంతో మోక్షజ్ఞపై డైరెక్టర్ బాబీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరి కాంబినేషన్లో త్వరలో సినిమా రాబోతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు వచ్చిన రావచ్చు అందులో సందేహం లేదు అంటూ కామెంట్స్ చేస్తుండగా బాబీ ఈ రేంజ్ లో పొగుడుతున్నారు అంటే తప్పకుండా సినిమా రావచ్చేమో అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.