టాలెంటెడ్ హీరోయిన్లు సాయి పల్లవి, నిత్యా మీనన్ ( Nitya Menon, Sai Pallavi )గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సింది ఏమీ లేదు.చిత్ర పరిశ్రమలలో హీరోయిన్ల స్థానం ఎలాంటిదో అందరికీ తెలిసిందే.
అటువంటి గడ్డు పరిస్థితులలో కూడా ఈ ఇద్దరు హీరోయిన్లు, తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని భర్తీ చేసుకుంటూ, ఎప్పటికీ సినిమా పరిశ్రమలలో కొనసాగుతూ వస్తున్నారు.ఇక హీరోల మాదిరి ఫ్యాన్ ఫాలోయింగ్ వీరిద్దరికి మాత్రమే సొంతం.
మలయాళంలో నిత్యామీనన్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే.ఇక అంతకంటే ఎక్కువగా సాయి పల్లకి మన తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మనకు తెలిసిందే.
అందుకే సాయి పల్లవిని ఇక్కడ లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
అయితే తాజాగా సోషల్ మీడియా( Social media )లో ఒక తంతు చెలరేగింది.మా హీరోయిన్ తోపు అంటే, మా హీరోయిన్ తోపు అని సదరు హీరోయిన్ల ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకు చస్తున్నారు.విషయమేమిటంటే, నిత్యామీనన్ కి ఇటీవల ఉత్తమ నటి కేటగిరీలో నేషనల్ అవార్డు రావడమే దానికి కారణం అని చెప్పుకోవచ్చు.
ఉత్తమ ఆట అవార్డు కేటగిరీలో సాయి పల్లవి, నిత్య పోటీ పడగా, ఆఖరికి నేషనల్ అవార్డు నిత్యమీనన్( National Award ) నే వరించిందని మనకు తెలుసు.ఇక్కడే అసలు చిక్కు మొదలైంది.
గార్గి ( Gargi )అనే సినిమాకు సాయి పల్లవి నామినేట్ అయితే, తిరుచిత్రాంబలం అనే సినిమాకి గాను నిత్య నామినేట్ అయింది.అయితే ఈ కేటగిరీలో ఆఖరికి నిత్యామీనన్ అవార్డు దక్కించుకుంది.దాంతో సాయి పల్లవి ఫాన్స్ హర్ట్ అయ్యారు.ఏ విషయంలో మా సాయి పల్లవి కంటే నిత్యమీనన్ ( Nithya Menen )టాలెంటెడ్ అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక ఈ ఫైటింగ్ చూసి విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.చాలా అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అవార్డులు ఇచ్చేటువంటి టీం ఓ నిర్ణయానికి వస్తారని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
సోషల్ మీడియా వచ్చాక ఎలాంటి పంచాయతీలు చాలా మామూలు అయిపోయాయి.విషయం ఏదైనాప్పటికీ సదరు హీరోయిన్ల టాలెంటు గురించి అందరికీ తెలిసిందే.