రాజబాబుది ఇంత మంచి మనస్తత్వమా.. ఈ ఒక్క సంఘటనే నిదర్శనం..?

కామెడీ అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు.ముఖ్యంగా మన తెలుగువారు కామెడీకి బాగా ప్రాధాన్యత ఇస్తారు.

 This Is The Example Of Raja Babu Good Nature ,raja Babu, Narsapur , Antastulu-TeluguStop.com

కామెడీ నాటకాలు, సినిమాలకు పెద్ద పీట వేస్తారు.మన తెలుగు వారికి కామెడీని పండించడం వెన్నతో పెట్టిన విద్య.

ఏ సినిమా ఇండస్ట్రీలో లేనంతగా తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు ఉన్నారు.ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్.

రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం వంటి కమెడియన్ల నుంచి ఇప్పటి కమెడియన్ల దాకా ఎంతోమంది తెలుగు తెరకు పరిచయమయ్యారు.వారిలో రాజబాబు ఒకరు.

పాతాళభైరవిలో అంజిగాడు పాత్రతో ఫేమస్ అయిన బాలకృష్ణ అంటే రాజబాబు( Raja Babu )కు చాలా ఇష్టం.ఆయన్ను చూసే సినిమాల్లో అడుగు పెట్టాడు.

దాదాపు 20 ఏళ్లు 514 సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు.అయితే ఈయన జస్ట్ 45 ఏళ్లకే చనిపోయి తీరని లోటు మిగిల్చాడు.

రాజబాబు అనేది ఆయన అసలు పేరు కాదు.తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు.1935, అక్టోబర్‌ 20న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం( Narsapur )లో పుట్టాడు.స్కూల్ డేస్‌లో బుర్రకథ నేర్చుకున్నాడు.

ఇంటర్మీడియట్‌ అయిపోయాక టీచర్‌ ట్రైనింగ్‌ తీసుకుని బడిపంతులుగా మారాడు.ప్రముఖ డ్రామా ఆర్టిస్ట్ గరికపాటి రాజారావులో మంచి నటుడు ఉన్నాడని గుర్తించాడు.

ఆయన సలహా మేరకే ఈ హాస్యనటుడు 1960లో మద్రాస్‌ వెళ్లి సినిమా అవకాశాల కోసం బాగా కష్టపడ్డాడు.ఆ సమయంలో పొట్టకూటి కోసం నటుడు, దర్శకుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ట్యూషన్‌ చెప్పడం మొదలుపెట్టాడు.

ఆయన తన స్వీయదర్శకత్వంలో వచ్చిన సమాజం సినిమాలో రాజబాబుకు ఓ చిన్న రోల్ ఇచ్చాడు.అలా కొద్దిపాటి గుర్తింపు తెచ్చుకున్న రాజబాబు అడపాద అడపా మరిన్ని అవకాశాలు అందుకున్నాడు.

చివరికి ‘అంతస్తులు (1965)’ చిత్రం( Antastulu )లో ఒక మంచి వేషాన్ని దక్కించుకున్నాడు.ఆ సినిమాలో తన సత్తా చాటి అందరి దృష్టిలో పడ్డాడు.

అప్పటి నుంచి మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు.రాజబాబు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఆయన జీవితం పరమార్థం ఏంటి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు.

జీవితంలో సంపాదించిన డబ్బులో ఎక్కువ శాతం దానాలే చేసేవాడు.రాజబాబు కెరీర్ స్టార్టింగ్‌లో ఒక సినిమా షూటింగ్‌ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

ఈ మూవీలోని ఓ షాట్‌ పూర్తి చేసి బయటికి వచ్చాడు రాజబాబు.అప్పుడు ఒక లైట్‌బాయ్‌ రాజబాబు దగ్గరకు వచ్చి “మీరు తప్పకుండా గొప్ప యాక్టర్ అవుతారు.

అప్పుడు మాత్రం నాకు బట్టలు పెట్టాలి” అని అన్నాడట.అతను చెప్పినట్టే రాజబాబు పెద్ద యాక్టర్ అయిపోయాడు.

ఒకరోజు లైట్‌బాయ్‌ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కానీ అతని పేరేంటి, అతను ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు వంటి వివరాలన్నీ రాజబాబుకు గుర్తులేదు.

Telugu Antastulu, Chennai, Lightboy, Narsapur, Raja Babu-Movie

అయినా సరే ఎలాగైనా అతనికి బట్టలు పెట్టాల్సిందే అని అనుకున్నాడు.అందుకే తన ప్రతి పుట్టినరోజున మద్రాస్‌లోని అన్ని స్టూడియోల లైట్‌బాయ్స్‌కి కొత్త బట్టలు దానం చేసేవాడు.బిర్యానీ ప్యాకెట్‌ కూడా ఇస్తూ మంచి మనసు చాటుకున్నాడు.

పబ్లిక్‌ ట్రస్ట్‌ పేరుతో ఒక సేవా సంస్థను స్థాపించాడు.సొంత డబ్బులతో కోరుకొండలో జూనియర్‌ కాలేజీ నిర్మించాడు.

రాజబాబు పేరుతోనే ఆ కాలేజీ ఇప్పటికీ నడుస్తోంది.

Telugu Antastulu, Chennai, Lightboy, Narsapur, Raja Babu-Movie

రాజమండ్రిలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం బంగీ కాలనీ ఏర్పాటు చేశాడు.తన భార్య పేరిట రాజమండ్రిలో ఒక ఆడిటోరియం కూడా కట్టించాడు.రాజబాబు ఒకసారి ‘రాణి ఔర్‌ లాల్‌పరి’ అనే హిందీ సినిమాలోని ఒక పాటలో యాక్ట్ చేశాడు.

రెమ్యునరేషన్‌ ఎంత కావాలో చెప్పండి అని ఆ ప్రొడ్యూసర్ అడిగాడు.చేసింది ఒక్క పాటే కాబట్టి రూ.5 వేలు ఇస్తే చాలు అని రాజబాబు అన్నాడట.కానీ, ఆ ప్రొడ్యూసర్ ఏకంగా రూ.40 వేలు అందజేశారు.రాజబాబు తాను మొదటగా అడిగినట్లు రూ.5 వేలే తీసుకున్నాడు.మిగిలిన రూ.35 వేలను ఆ సినిమా షూటింగ్‌లో ఉన్న టెక్నీషియన్స్‌కు ఇచ్చేసేయ్ తన గొప్ప మనసుని చాటుకున్నాడు.ఆ ప్రొడ్యూసర్ కూడా రాజబాబు గొప్ప మనసుకి ఫిదా అయిపోయారు.

రాజబాబు వైవాహిక జీవితంలో సంతృప్తి చెందలేదట.ఆ కారణంగానే మద్యానికి అలవాటు పడి తర్వాత గొంతు క్యాన్సర్ తో చనిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube