అర్జున్ రెడ్డి విషయంలో సందీప్ ఎందుకంత రిస్క్ చేశాడు..?

2017లో విడుదలైన రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ “అర్జున్ రెడ్డి”( Arjun Reddy ) సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే.దీనికి సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) కథ అందించడమే కాకుండా దర్శకత్వం వహించాడు.

 Why Sandeep Reddy Took Risk, Sandeep Reddy Vanga, Bhadrakali Pictures, Arjun Red-TeluguStop.com

అతడి బ్రదర్ ప్రణయ్ రెడ్డి వంగా “భద్రకాళి పిక్చర్స్” ( Bhadrakali Pictures )బ్యానర్ పై దీన్ని నిర్మించాడు.తండ్రి స్థిరాస్తులు అమ్మి రూ.5 కోట్లు పెట్టి ఈ సినిమా తీశారు.ఇందులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటించగా, రాహుల్ రామకృష్ణ సైడ్ హీరోగా నటించి మెప్పించాడు.

సందీప్ రెడ్డి మొదటి సినిమా ఇది.దీని కోసం అతడు చాలా రిస్క్ చేశాడని చెప్పుకోవాలి.ఈ దర్శకుడు “అర్జున్ రెడ్డి” స్క్రిప్ట్‌పై రెండేళ్లు పనిచేశాడు.నాలుగైదు సంవత్సరాలు తన సినిమాని ఫైనాన్స్ చేయడానికి నిర్మాతల చుట్టూ తిరిగాడు.

Telugu Arjun Reddy, Bhadrakali, Pranay Reddy, Sandeepreddy, Teaser, Trailer, San

కొత్త దర్శకుడు, పైగా సినిమా కథ చాలా బోల్డ్‌గా ఉండటంవల్ల చాలామంది ప్రొడ్యూసర్లు దీన్ని తీయడానికి ఒప్పుకోలేదు.చివరికి ఇద్దరు డైరెక్టర్లు దీన్ని బ్యాంకు రోల్ చేసేందుకు ఓకే చెప్పారు.కానీ వారు సందీప్ కి స్వేచ్ఛ ఇవ్వలేదు.సందీప్ ఈ సినిమాని చాలా కొత్తగా తీయాలనుకున్నాడు.టీజర్, ట్రైలర్ కూడా రొటీన్ కి భిన్నంగా కట్ చేయాలి అనుకున్నాడు.ట్రైలర్‌ను మూడు నిమిషాలు కట్ చేయాలని భావించాడు కానీ ఇందుకు ఆ నిర్మాతలు ఒప్పుకోలేదు.

భారీగా మార్పులు చేయాలని చెప్పలేదు కానీ కొన్ని మార్పులు చేయాల్సిందిగా నిర్మాతలు డిమాండ్ చేశారు.కానీ సందీప్ అందుకు ఒప్పుకోలేదు.

తన సినిమా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇస్తే చాలు అని, తనకు అనవసరంగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించాడు.అందుకే ఆ ఇద్దరి నిర్మాతలతో కలిసి పని చేయడానికి ఒప్పుకోలేదు.

వారిని తనంతట తానే రిజెక్ట్ చేశాడు.

Telugu Arjun Reddy, Bhadrakali, Pranay Reddy, Sandeepreddy, Teaser, Trailer, San

తర్వాత అతని తండ్రి, సోదరుడు ఈ సినిమా కోసం డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.అలా సినిమా పట్టాలెక్కడం, తర్వాత అది సూపర్ హిట్ కావడం జరిగిపోయింది.ఒకవేళ ఈ సినిమాని ఇతర నిర్మాతలు ప్రొడ్యూస్ చేసి ఉంటే ఇది కచ్చితంగా ఒక మాస్టర్ పీస్ అయి ఉండేది కాదు.

ఎందుకంటే కొత్త దర్శకుడికి నచ్చినట్లు సినిమా తీయకుండా నిర్మాతలు అడ్డుకుంటూ ఉంటారు.ఫలితంగా మూవీ అనేది ఒక కమర్షియల్ ఫార్ములా లో వస్తుంది.దీనివల్ల అది ఒక మాస్టర్ పీస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు.సందీప్ మొదటి సినిమా విషయంలో అలా జరగలేదు కాబట్టి ఆయన లక్కీ అని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube