"యానిమల్" తెలుగు డబ్బింగ్ కోసం రాకేందు మౌళి ఎంత కష్టపడ్డాడో తెలుసా..

2023లో వచ్చిన యాక్షన్ క్రైమ్ మూవీ “యానిమల్” ( Animal )సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ దేవల్, రష్మిక మందన్నా, త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించారు.

 Sandeep Reddy Hard Work For Animal Dubbing , Sandeep Reddy , Animal Dubbing, Ani-TeluguStop.com

ఈ సినిమాని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాడు.ఈ సినిమా ఒక వ్యాపారవేత్త కుమారుడి చుట్టూ తిరుగుతుంది.

ఆ కొడుకు పేరు రణ్‌విజయ్( Ranvijay ).అతను చాలా దూకుడుగా, క్రూరంగా ఉంటాడు.తండ్రికి, కొడుకుకి మధ్య చాలా గొడవలు జరుగుతాయి.ఎందుకంటే తండ్రి తన కొడుకు చేసే పనులను అంత ఇష్టపడడు.

కానీ కుమారుడికి తండ్రి అంటే చాలా ఇష్టం.అందుకే తన తండ్రిని చంపడానికి ప్రయత్నిస్తున్న వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.

తండ్రీకొడుకుల ప్రేమను అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది.ఈ సినిమా హిందీలో తీశారు కాబట్టి హీరో ఎక్కువగా “పాపా పాపా” అని పదాలు పలుకుతుంటాడు.అయితే తెలుగు డబ్డ్‌ యానిమల్ వెర్షన్‌లో కూడా పాపా అని ఉండేలాగా డైలాగ్స్ రాయమని సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) డైలాగ్ రైటర్ రాకేందు మౌళికి చెప్పాడు.అంతకుముందు సందీప్ యానిమల్ సినిమాలో హీరో “నాన్న” అంటేనే తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనుకున్నాడు.

Telugu Animal, Ranbeerkapoor, Ranvijay, Sandeep Reddy, Sandeepreddy-Movie

అయితే హిందీ సినిమాలో రణ్‌బీర్ కపూర్ పాపా అనే పలికాడు.కానీ తెలుగులో నాన్న అని పెడితే పాపా, నాన్న రెండూ లిప్‌ సింక్ అయ్యే అవకాశం ఉండదు అని, పైగా క్యారెక్టర్ల పేర్లన్నీ హిందీలోనే ఉన్నాయి కాబట్టి పాపా అనే రాద్దామని డైలాగ్ రైటర్ రాకేందు అతన్ని కన్విన్స్ చేశాడు.హిందీలో ఎన్నో డైలాగులు ఉండగా వాటన్నిటినీ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే లాగానే రాయాలని పెద్ద పని చెప్పాడు సందీప్ రెడ్డి.దీనివల్ల డైలాగ్ రైటర్ రాకేందు మౌళి చాలానే కష్టపడ్డాడు.

వీలైనంతవరకు తెలుగు వారికి కనెక్ట్ అయ్యేలాగా డైలాగులు రాశాడు.

Telugu Animal, Ranbeerkapoor, Ranvijay, Sandeep Reddy, Sandeepreddy-Movie

ఇక సినిమా మొత్తం కూడా పాప పాపా అని రాసాడు.అయితే సినిమా అంతటా పాపా పాపా అని ఉన్నా చివరిలో “యాలో యాలా” పాట సందర్భంగా హీరో చేత ఎలాగైనా నాన్న అని పిలిపించాలని సందీప్ అనుకున్నాడు.కానీ 90% పాపా అని, రిమైనింగ్ పార్ట్ లో నాన్న అని పిలిస్తే ఆడియన్స్ కి ఇబ్బందికరంగా ఉంటుందని సందీప్ అనుకున్నాడు.

అందుకే మళ్ళీ మొదటి నుంచి నాన్న అనే డైలాగులు రాయాలని సందీప్ రిక్వెస్ట్ చేశాడు.దాంతో మళ్లీ మొదటి నుంచి నాన్న అని మౌళి డైలాగ్స్ రాయాల్సి వచ్చింది.

ఇది చాలా సమయం, కష్టంతో కూడుకున్న పని అని చెప్పుకోవచ్చు.ఇక తెలుగు వర్షన్ యానిమల్ సినిమాలోని పాటలన్నీ అనంత శ్రీరామ్ అద్భుతంగా రాశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube