ఇండస్ట్రీ హిట్ మూవీ కల్కికి ఆ డీల్ పూర్తి కాలేదా.. ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ అంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) ఇటీవల నటించిన తాజా చిత్రం కల్కి.( Kalki ) భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది.మరోసారి ఈ సినిమాతో తన స్టామినాను నిరూపించుకున్నారు ప్రభాస్.ఈ సినిమా ఓవర్సీస్ లో దుమ్ము దులిపింది.ఆ తర్వాత ఓటీటీలో కూడా సత్తా చాటింది.ఓటీటీలో కూడా కలెక్షన్ల సునామీని సృష్టించింది కల్కి మూవీ.

 Kalki Movie Satellite Deal Is Still Pending Details, Kalki, Tollywood, Prabhas,-TeluguStop.com
Telugu Kalki, Kalki Ad, Kalkisatellite, Kalki Satellite, Nag Ashwin, Prabhas, Pr

మరి ఇన్ని రికార్డులు సృష్టించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్( Satellite Rights ) హాట్ కేకులా అమ్ముడుపోవాలి.ఈ పాటికే ఏదో ఒక ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోవాలి.కానీ అలా జరగడం లేదు.కల్కి సినిమా శాటిలైట్ డీల్ ఇంకా పూర్తికాలేదు.ప్రారంభంలో స్టార్ మా ఛానెల్ చుట్టూ తిరిగిన ఈ సినిమా, ఇప్పుడు జీ గ్రూప్ దగ్గర ల్యాండ్ అయింది.సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకునేందుకు జీ గ్రూప్( Zee ) సూచన ప్రాయంగా అంగీకరించింది.

రేటు కూడా లాక్ అయింది.అయితే అగ్రిమెంట్ మాత్రం ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.

మిగతా భాషల శాటిలైట్ రైట్స్ పై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేస్తారట.

Telugu Kalki, Kalki Ad, Kalkisatellite, Kalki Satellite, Nag Ashwin, Prabhas, Pr

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన కల్కి సినిమా ఇంకా శాటిలైట్ డీల్ పూర్తి చేసుకోకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే అని చెప్పాలి.శాటిలైట్ మార్కెట్ ఏ స్థాయిలో పడిపోయిందో చెప్పడానికి బహుశా కల్కికి మించిన ఉదాహరణ ఉండదేమో మరి.అయితే ఇది నిజంగా అభిమానులకు కాస్త షాకింగ్ అని చెప్పాలి.ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ విషయానికి వస్తే.ప్రస్తుతం ప్రభాస్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం నాలుగైదు పాన్ ఇండియా ప్రాజెక్టులతో క్షణం కూడా తీరికలేకుండా గడుపుతున్నారు డార్లింగ్ ప్రభాస్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube