తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ప్రస్తుతం దేవర సినిమాతో( Devara ) ఆయన క్రేజ్ ను మరింత పెంచుకోవాలనే ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక నేపద్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క సాంగ్ ను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి ఒక భారీ మాస్ యాక్షన్ ట్రైలర్ ని కూడా ఈనెల 20వ తేదీన రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి దానికి సంబంధించినట్టుగానే భారీ ప్రణాళికలను కూడా రూపొందించుకుంటున్నారు.ఇక ఈ సినిమాతో డైరెక్టర్ ‘కొరటాల శివ ‘ మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.కాబట్టి తను ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక కొరటాల శివ( Koratala Siva ) చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికి ఆచార్య సినిమాతో మాత్రం ఆయన చాలావరకు డీలపడ్డాడనే చెప్పాలి.మరి ఈ సినిమా సక్సెస్ తో ఆచార్య సినిమా మీద వచ్చిన విమర్శలకు చెక్ పెడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక మొత్తానికైతే ఈ సినిమాని భారీ సక్సెస్ ఫుల్ సినిమాగా మార్చే దిశగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుని కొరటాల శివ ముందుకు సాగుతున్నాడు.ఇక ఒక్కసారి ట్రైలర్ కనక వచ్చినట్లయితే సినిమా మీద అంచనాలను పెంచేస్తుంది అంటూ కొరటాల భారీ అంచనాలను పెట్టుకున్నాడు.ఇక దాంతో పాటు ఈ సినిమాలో సూర్య( Surya ) కూడా ఒక క్యామియో రోల్ పోషించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనే విషయాలు తెలియదు.కానీ సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక సూర్య ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా గ్రాఫ్ అనేది మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి…