టాలీవుడ్ లో ఇప్పటి వరకు పోలీస్ పాత్రలు నటించని ముగ్గురు హీరోలు వీరే !

సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ప్రతి హీరో ఎన్నో రకాల పాత్రను పోషించాలని అనుకుంటూ ఉంటారు.అలా అన్ని రకాల పాత్రలు పోషిస్తేనే వారి కెరియర్ సంపూర్ణం అయినట్టు లెక్క.

 Tollywood Heros Who Are Not Played Police Role Prabhas Nani Vijay Devarakonda De-TeluguStop.com

అందుకే మన టాలీవుడ్ హీరోలు అన్ని రకాల పాత్రలు మరియు అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్రలో నటించారని కోరుకుంటారు.అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ లో కొంత మంది హీరోలు పోలీస్ పాత్రలో( Police Character ) నటించలేదు.

అందుకు కారణాలు ఏమైనా కావచ్చు కానీ అవకాశం ఉన్నప్పటికి కూడా ఈ ముగ్గురు హీరోలు పోలీస్ పాత్రలో నటించలేదు.ఇంతకి ఆ హీరోలు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రభాస్

Telugu Heroes Role, Nani, Nani Role, Prabhas, Sandeepreddy, Spirit, Tollywood He

ప్రభాస్ ( Prabhas ) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 22 ఏళ్ళు అయింది.అనేక సినిమాల్లో నటించిన కూడా ఇప్పటి వరకు ఒక్క పోలీస్ పాత్రలో కూడా నటించలేదు.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్( Spirit ) సినిమాలో పోలీస్ పాత్రలో ఉన్న ఒక లుక్ అయితే బయటకు వచ్చింది.కానీ అందులో అతడు పోలీసు పాత్ర వేస్తున్నాడో లేదో ఇంకా క్లారిటీ లేదు.

నాని

Telugu Heroes Role, Nani, Nani Role, Prabhas, Sandeepreddy, Spirit, Tollywood He

హీరో నాని( Hero Nani ) అష్టా చమ్మా సినిమాతో హీరో అయ్యాడు.దాదాపు 30 కి పైగా సినిమాల్లో అతడు హీరోగా నటించాడు.కానీ ఇప్పటి వరకు ఎందుకో పోలీస్ పాత్రలో మాత్రం నటించడం లేదు.తన పర్సనాలిటీ సరిపోదు అనుకుంటున్నాడో లేక మరేదైనా కారణం ఉందో ఏమో తెలియదు కానీ పోలీస్ పాత్రలకు నాని దూరంగానే ఉంటున్నాడు.

విజయ్ దేవరకొండ

Telugu Heroes Role, Nani, Nani Role, Prabhas, Sandeepreddy, Spirit, Tollywood He

ఇప్పటికే 11 సినిమాల్లో హీరోగా నటించాడు హీరో విజయ్ దేవరకొండ.( Vijay Devarakonda ) మంచి ఎలివేషన్ ఉన్న సినిమాలో నటించాలని కోరుకుంటున్న ఈ హీరో మాస్ లో ఫుల్ గ్రిప్ అయితే తెచ్చుకున్నాడు.కానీ పోలీస్ పాత్రలో మాత్రం నటించడం లేదు.మరి పోలీస్ పాత్రకు చక్కగా సరిపోయే బాడీ ఉన్నప్పటికి విజయ్ ఆ వైపు తొంగి చూడడం లేదు.ఇకనైనా పోలీస్ పాత్రలో నటిస్తే చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube