సీతారకు మహేష్ దంపతుల బర్త్డే విషెస్.. వైరల్ పోస్ట్..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి( Ghattamaneni family ) ఓ చరిత్ర ఉంది.ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ నుంచి ఘట్టమనేని గౌతమ్ వరకు అందరికీ ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి.

 Mahesh Couple's Birthday Wishes Viral Post For Sithara, Mahesh Babu, Namratha, S-TeluguStop.com

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల ( Superstar Mahesh Babu, Namratala )ముద్దుల కూతురు సీతార గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పవలసిన పనిలేదు.సితార అతి చిన్న వయసులో నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనలో ఉండే టాలెంట్ ను నిరూపించుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక సితార యాక్టింగ్, సింగింగ్ ,పెయింటింగ్, డాన్సింగ్ లలో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.

కేవలం ఇలా తనలోని టాలెంట్ తో ప్రముఖ బంగారు నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసింది.ఇక ఆ బ్రాండ్ అంబాసిడర్ గా సీతార( Sitara ) చేసినందుకుగాను వచ్చిన రెమ్యూనరేషన్ ని తాను ఉపయోగించకుండా ప్రజల సేవా కార్యక్రమం కోసమే వినియోగించింది.దీన్త సితారను వారి పేరెంట్స్ ఎలా పెంచారో ఇట్టే అర్థమవుతుంది.

ఇకపోతే నేడు సీతార తన 12 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటుంది.ఈ సందర్భంగా మహేష్ బాబు తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.

తన X ఖాతాలో “హ్యాపీ 12 మై సన్ షైన్ ” ( Happy 12th My Sunshine )ఇలా రాసుకు వచ్చాడు.ఈ పోస్ట్ లో సూర్యుడి వెలుగు సితార ముఖం పై ప‌డే ఫోటోను అటాచ్ చేస్తూ పోస్ట్ చేశాడు.

మరోవైపు తల్లి నమ్రత శిరోద్కర్ కూడా సితారకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా విషెస్ తెలిపింది.

” నా అభిమాన చిన్న ప్రయాణ సహచరుడికి జన్మదిన శుభాకాంక్షలు.వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు, నువ్వు ఎల్లప్పుడూ నాకు చిన్న గైడ్‌ గా ఉంటావు.ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకంగా చేస్తావు.

ఈ క్షణాలు, జ్ఞాపకాలను జరుపుకుంటున్నాను.నువ్వు ఎంత అపురూపమైన చిన్న అమ్మాయిగా ఎదుగుతున్నావో నేను చూస్తున్న.

నేను నిన్నుఎప్పటికీ, ఎప్పుడూ ప్రేమిస్తాను అంటూ.హ్యాపీ 12 నా చిన్నారి” ఆని పోస్ట్ చేసింది.

ఇక ఇటీవల అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో కూడా మహేష్ బాబు, సితార, నమ్రత ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube