టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ అంటే ప్రభాస్ పేరు మొదటిగా వినిపిస్తూ ఉంటుంది.
బాహుబలి లాంటి భారీ సినిమాతో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్న డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ మారిన విషయం తెలిసిందే.ఈ సినిమా నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా పాన్ ఇండియా సినిమాల ట్రెండు మొదలైంది.
బాహుబలి సినిమా తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలాంటి సినిమాలతో అభిమానులను నిరాశపరిచినప్పటికీ సలార్, కల్కి డబుల్ ట్రీట్ ఇచ్చాడు.
ఇక తాజాగా విడుదలైన కల్కి సినిమా( Kalki Movie ) భారీ విజయం సాధించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ మరింత పెరిగింది.జూన్ 27న విడుదలైన ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.త్వరలోనే ఈ మూవీ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు నెటిజన్స్.ఇదిలా ఉంటే కల్కి సినిమాలో పంజాబీ పాప్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ తో( Diljit Dosanjh ) కలిసి స్టెప్పులేశాడు డార్లింగ్.
ఈ పాటలో ప్రభాస్ లుక్ అందరిని ఆశ్చర్యపరిచింది.పంజాబీ స్టైల్లో కనిపించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేశాడు.
అయితే ఈ పాటతోపాటు కల్కి ప్రమోషన్లలో ప్రభాస్ డోల్స్ గబ్బానా సన్ గ్లాసెస్( Dolce Gabbana Sunglasses ) ధరించిన సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు ఆ సన్ గ్లాసెస్ ధర తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ట్రై చేస్తున్నారు.సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ డికోడ్ ప్రకారం ప్రభాస్ ధరించిన ఆ సన్ గ్లాసెస్ ధర రూ.35,314 గా ఉంది.అయితే అంత సింపుల్ గా ఉన్న ఆ సన్ గ్లాసెస్ ధర తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.ఏంటి ఆ గ్లాసెస్ ఏకంగా అన్ని వేలా అంటూ షాక్ అవుతున్నారు.