పర్మిట్ రూంలకు అర్థరాత్రి వరకు పర్మిషన్ ఉందా...?

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని శ్రీ దుర్గా వైన్స్ వారి పర్మిట్ రూం రాత్రి 10 గంటల తర్వాత ఓపెన్ అవుతుంది.నిబంధనల ప్రకారం వైన్స్ షెట్టర్ క్లోజ్ చేసి దర్జాగా పర్మిట్ రూమ్ ఓపెన్ చేసి సిట్టింగ్ నడుపుతూ మందుబాబులకు మద్యం సరఫరా చేస్తూ సేవించడానికీ ప్రోత్సహిస్తున్నారు.

 Do Permit Rooms Have Permission Till Late Night, Permit Rooms ,permission , Late-TeluguStop.com

నిబంధనల మేరకు వైన్స్ బంద్ చేయగానే పర్మిట్ రూం కూడా బంద్ చేయాల్సి ఉండగా శ్రీ దుర్గా వైన్స్ నిర్వాహకులు మాత్రం ఎవరికీ చెప్పిన ఏం కాదు.మమల్ని ఏ అధికారులు ఏం చేయలేరనే ధీమాతో ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు.

ఇంతకీ నిబంధనలు వైన్స్ షాపుకు మాత్రమేనా ?పర్మిట్ రూమ్ కు తెల్లవారేదాక పర్మిషన్ ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ వైన్స్ ప్రధాన రహదారిపై ఉండడంతో అతిగా మద్యం సేవించి రోడ్డుపై రాత్రి పూట వాహనాలపై వెళ్లేటపుడు ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరో ఎక్సజ్ శాఖ అధికారులు చెప్పాలి.

ఇంతా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుంది.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన శ్రీ దుర్గా వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube