పర్మిట్ రూంలకు అర్థరాత్రి వరకు పర్మిషన్ ఉందా…?
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలోని శ్రీ దుర్గా వైన్స్ వారి పర్మిట్ రూం రాత్రి 10 గంటల తర్వాత ఓపెన్ అవుతుంది.
నిబంధనల ప్రకారం వైన్స్ షెట్టర్ క్లోజ్ చేసి దర్జాగా పర్మిట్ రూమ్ ఓపెన్ చేసి సిట్టింగ్ నడుపుతూ మందుబాబులకు మద్యం సరఫరా చేస్తూ సేవించడానికీ ప్రోత్సహిస్తున్నారు.
నిబంధనల మేరకు వైన్స్ బంద్ చేయగానే పర్మిట్ రూం కూడా బంద్ చేయాల్సి ఉండగా శ్రీ దుర్గా వైన్స్ నిర్వాహకులు మాత్రం ఎవరికీ చెప్పిన ఏం కాదు.
మమల్ని ఏ అధికారులు ఏం చేయలేరనే ధీమాతో ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు.
ఇంతకీ నిబంధనలు వైన్స్ షాపుకు మాత్రమేనా ?పర్మిట్ రూమ్ కు తెల్లవారేదాక పర్మిషన్ ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ వైన్స్ ప్రధాన రహదారిపై ఉండడంతో అతిగా మద్యం సేవించి రోడ్డుపై రాత్రి పూట వాహనాలపై వెళ్లేటపుడు ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరో ఎక్సజ్ శాఖ అధికారులు చెప్పాలి.
ఇంతా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుంది.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన శ్రీ దుర్గా వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కోట్ల ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన భాస్కర్ రావు.. మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!