తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు విష్ణు( Vishnu Manchu ) హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ తనకంటూ ఒక్కటి కూడా సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయన ఇప్పటివరకు కూడా స్టార్ హీరోగా మారలేకపోయాడు.ఇక ప్రస్తుతం ఆయన ఒకటి అర సక్సెస్ లతో ఇండస్ట్రీలో నెట్టుకస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం ఆయనకు దక్కడం లేదు.
అందుకే ఆయన 150 కోట్లు బడ్జెట్ ను పెట్టి ‘కన్నప్ప( Kannappa )’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఇది భారీ గ్రాఫికల్ సినిమాగా తెరకెక్కుతున్నప్పటికీ ఈ సినిమాలో చాలామంది పాన్ ఇండియా ఆర్టిస్టులను తీసుకున్నట్లుగా తెలుస్తుంది.ఇక దాంతో బడ్జెట్ అనేది భారీగా పెరుగిపోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మంచు విష్ణు మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించి సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ఇప్పటికే మోహన్ లాల్, అక్షయ్ కుమార్( Akshay Kumar, Mohanlal), ప్రభాస్ లాంటి స్టార్ హీరోలను కూడా భాగం చేయడం అనేది ఒక వంతుకు మంచి విషయం అనే చెప్పాలి.మరి ఇలాంటి క్రమంలోనే ఈ బడ్జెట్ పెరిగిపోతుంది.
ఇక ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంటే పర్లేదు.కానీ ఒకవేళ సినిమా తేడా కొడితే మాత్రం మంచు విష్ణు భారీగా నష్టపోవాల్సి వస్తుందంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక 150 కోట్లు బడ్జెట్ అనుకున్న ఈ సినిమాకి దాదాపు 200 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి విష్ణు తన సత్తా ఏంటో చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే విష్ణు ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక తను అనుకున్నట్టుగానే సక్సెస్ దక్కుతుందా లేదా తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.