రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి రోజున జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధాని కావాలని అలాగే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ రెండోసారి ఎంపీగా భారీ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తూ గోత్రనామాల పేర్లతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ని అలాగే కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సంజయ్ ని గెలిపించాలని ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 1 కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని,
ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ మూడో సారి ప్రధాని అయితే దేశం మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పత్తిపాక శ్రీనివాస్,చెన్నమనేని మదన్ రావ్,లోకోజి సతీష్, దుర్షెట్టి రాజు, పాటి సుధాకర్, కోన రమేష్,జక్కని రాజేశం,బొడ్డు కృష్ణ, పొంచెట్టి తిరుమల్, గొల్లపల్లి సాయికృష్ణ, మోత్కుపల్లి మధు పంచరుపుల దివ్యసాగర్, అర్సo సత్యనారాయణ,జాల గంగాధర్ ,పిసరి వెంకటేష్, మూడపెళ్లి ముకేష్,దొంతుల అశోక్ , పత్తిపాక మల్లయ్య మరియు బిజేపి సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.