వైరల్ వీడియో: మంటల్లో కాలుతున్న మారుతి వ్యాన్.. ఒక్కసారిగా బాంబ్ లా పేలుడు..

ప్రస్తుతం వేసవికాలం( Summer ) నేపథ్యంలో అనేకచోట్ల వాహనాలు ఎండకు కాలిపోయిన దృశ్యాలు మనం సోషల్ మీడియాలో అనేకంగా చూసే ఉంటాము.ప్రస్తుతం దేశంలో రికార్డు స్థాయిలలో ఉష్ణోగ్రత నమోదైన సంఘటనలు మనం చూస్తున్నాం.

 Maruti Van Thrown Into Air After Blast Due To Fire In Bulandshahr Viral Video De-TeluguStop.com

ఇంటి బయట పార్కు చేసిన కార్లలో( Cars ) అలాగే మిగతా వాహనాల్లో కూడా ఎండ వేడిమీ తట్టుకోలేక కొన్ని వాహనాలు మంటలలో కాలి దగ్ధం అవుతున్నాయి.తాజాగా ఇలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్లో( Uttar Pradesh ) చోటుచేసుకుంది.

సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్( Bulandshahr ) నుండి కారులో మంటలు చెలరేగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో కేవలం కారులో మంటలో కాలడమే కాకుండా కారు నుండి భారీ మంటలు చెలరేగుతున్న సమయంలో సడన్గా పేలింది.ఈ భయంకరమైన సంఘటనతో అక్కడ ఉన్న ప్రజలు రోడ్లపై పరిగెత్తడం వైరల్ గా మారిన వీడియోలో చూడొచ్చు.

నగరంలోని ఖాన్పూర్ ఏరియాలో ఈ సంఘటన జరిగింది.మార్కెట్ మధ్యలో నిలిపిన మారుతి వ్యాన్ లో( Maruti Van ) అకస్మాత్తుగా మంటలు చెలరేగగా కారు నుండి భారీ మంటలు ఎగిసి పడ్డాయి.20 నిమిషాల పాటు కారు మంటలలో కాలగా ఆ తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.అయితే అదృష్టవశాత్తు అక్కడ ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగకపోవడం సంతోషకరమైన విషయం.

అయితే ఈ మారుతి వ్యాన్ సిఎన్జి గ్యాస్ తో నడిచే కారని., కారులో ఏర్పాటు చేసిన సిలిండర్ కారణంగానే ఇలాంటి పేలుడు సంభవించిందని సమాచారం అందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube