వైరల్ వీడియో: మంటల్లో కాలుతున్న మారుతి వ్యాన్.. ఒక్కసారిగా బాంబ్ లా పేలుడు..
TeluguStop.com
ప్రస్తుతం వేసవికాలం( Summer ) నేపథ్యంలో అనేకచోట్ల వాహనాలు ఎండకు కాలిపోయిన దృశ్యాలు మనం సోషల్ మీడియాలో అనేకంగా చూసే ఉంటాము.
ప్రస్తుతం దేశంలో రికార్డు స్థాయిలలో ఉష్ణోగ్రత నమోదైన సంఘటనలు మనం చూస్తున్నాం.ఇంటి బయట పార్కు చేసిన కార్లలో( Cars ) అలాగే మిగతా వాహనాల్లో కూడా ఎండ వేడిమీ తట్టుకోలేక కొన్ని వాహనాలు మంటలలో కాలి దగ్ధం అవుతున్నాయి.
తాజాగా ఇలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్లో( Uttar Pradesh ) చోటుచేసుకుంది.సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
"""/" /
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్( Bulandshahr ) నుండి కారులో మంటలు చెలరేగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో కేవలం కారులో మంటలో కాలడమే కాకుండా కారు నుండి భారీ మంటలు చెలరేగుతున్న సమయంలో సడన్గా పేలింది.
ఈ భయంకరమైన సంఘటనతో అక్కడ ఉన్న ప్రజలు రోడ్లపై పరిగెత్తడం వైరల్ గా మారిన వీడియోలో చూడొచ్చు.
"""/" /
నగరంలోని ఖాన్పూర్ ఏరియాలో ఈ సంఘటన జరిగింది.మార్కెట్ మధ్యలో నిలిపిన మారుతి వ్యాన్ లో( Maruti Van ) అకస్మాత్తుగా మంటలు చెలరేగగా కారు నుండి భారీ మంటలు ఎగిసి పడ్డాయి.
20 నిమిషాల పాటు కారు మంటలలో కాలగా ఆ తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.
అయితే అదృష్టవశాత్తు అక్కడ ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగకపోవడం సంతోషకరమైన విషయం.అయితే ఈ మారుతి వ్యాన్ సిఎన్జి గ్యాస్ తో నడిచే కారని.
, కారులో ఏర్పాటు చేసిన సిలిండర్ కారణంగానే ఇలాంటి పేలుడు సంభవించిందని సమాచారం అందుతుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి19, ఆదివారం 2025