ఎన్నికల కోడ్ ముగియగానే రైతు రుణమాఫీ..: సీఎం రేవంత్ రెడ్డి

నిజామాబాద్ లో( Nizamabad ) కాంగ్రెస్ నిర్వహించిన ‘జనజాతర’ సభలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పాల్గొన్నారు.నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

 Farmers Loan Waiver After The End Of Election Code Cm Revanth Reddy Details, Cm-TeluguStop.com

పాదయాత్రలో నిజామాబాద్ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.పసుపు బోర్డు( Turmeric Board ) కోసం ఆర్మూరు రైతులు దీక్ష చేశారన్న ఆయన రైతుల దీక్షకు తాను మద్ధతు తెలిపానన్నారు.

పసుపు రైతులు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని పేర్కొన్నారు.సెప్టెంబర్ 17వ తేదీ లోపు చక్కెర పరిశ్రమను తెరిపిస్తామని హామీ ఇచ్చారు.

చక్కెర పరిశ్రమ మూతపడేలా కేసీఆర్ చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బీఆర్ఎస్ బోర్డు తేలేదని, చక్కెర పరిశ్రమను తెరిపించలేదని విమర్శించారు.మాట తప్పిన కవితను రైతులు రాజకీయంగా శాశ్వత సమాధి చేశారని చెప్పారు.

పసుపు బోర్డు తెస్తానని ధర్మపురి అర్వింద్( Dharmapuri Arvind ) బాండ్ పేపర్ రాసిచ్చారని ఎద్దేవా చేశారు.అయితే కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.వంద రోజుల్లో ఐదు పథకాలను అమలు చేశామని, త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.ఎన్నికల కోడ్ ముగియగానే రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube