ఏపీలో ఎన్నికలకు ఇంక నెలరోజులు మాత్రమే సమయం ఉంది.ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా( Mukesh Kumar Meena ) గురువారం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వాలంటీర్లపై( Volunteers ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 44వేల 163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వెయ్యి పదిహేడు మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.మరో 86 మంది వాలంటీర్లపై కేసులు నమోదయాయాన్ని తెలియజేశారు.
కాగా వైసీపీకి( YCP ) ప్రచారం చేసేందుకు పలు నియోజకవర్గాలలో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని తెలిపారు.మొత్తంగా ఈసారి ఎన్నికలలో ఐదు లక్షల ఇరవై ఆరు వేల పదిమంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటుండగా…పోలింగ్ డ్యూటీలో 3.30 లక్షల మందిని నియామకం చేసినట్లు ఎంకే మీనా వెల్లడించడం జరిగింది.ఇదే సమయంలో ఆరు అసెంబ్లీ స్థానాలు తప్ప మిగతా చోట్ల ఉదయం ఏడు గంటలకే పోలింగ్ జరుగుతుందని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు, పాలకొండ, కురూపం, సాలూరులో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో 300 కంపెనీల బలగాలు రాష్ట్రానికి వస్తాయని ఎంకే మీనా వెల్లడించడం జరిగింది.