నేటి సమాజంలో యువత వారి టాలెంట్ నిరూపించుకునేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అనేకమంది సక్సెస్ అవుతున్నారు.మరికొందరు తుంటరి పనులు చేస్తూ.
పిచ్చిపిచ్చి వేషాలు వేస్తూ., చివరికి వారి ప్రాణాల మీదికి తెచ్చుకునే విధంగా సోషల్ మీడియాను వాడుతున్నారు.
ఒక్కోసారి వారు ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాకుండా ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టివేసే ఎన్నో సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం చూసే ఉంటాం.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు యువత ఎలాంటి పనులు చేయడానికి అయినా వెనకాడకుండా సాహసాలు చేసేస్తున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో గురించి చూస్తే.
తాజాగా ఢిల్లీ ( Delhi )నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్కూటీ ప్రయాణం ( Scooty travel )చేస్తున్నారు.స్కూటీపై కూర్చున్న ముగ్గురిలో మధ్యలో కూర్చున్న బాలుడు చేసిన తుంటరి పనికి చివరికి.చివరిగా కూర్చున్న వ్యక్తి ప్రాణాలకు ముప్పు వాటిల్లింది.స్కూటీ వాహనం వేగంగా వెళుతున్న సమయంలో స్కూటీ మధ్యలో ఉన్న వ్యక్తి కారణంగా ఈ షాకింగ్ ఘటన జరిగింది.
మధ్యలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడిని చేత్తో పైకెత్తి ఉన్నట్లుండి రోడ్డుపై పడేస్తాడు. ఇలా అనుకోని షాపింగ్ ఘటనతో చివర ఉన్న వ్యక్తి కింద పడిపోతూ అతని చేతులు పట్టుకోబోతాడు.
కాకపోతే చివరికి అతడి చేయని జార విడిచి రోడ్డుపై వేగంగా పడిపోతాడు.
మిగతా ఇద్దరూ నవ్వుకుంటూ బండిని ఆపకుండా ముందుకు వెళ్ళిపోతారు.ఈ సంఘటన మొత్తం పక్కనే ఉన్న మరో వాహనంలో వెళ్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో కాస్త చివరికి ఢిల్లీ పోలీసుల వరకు వెళ్ళింది.ఇక ఈ వీడియోకు సంబంధించి నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
కొందరైతే ఇది మహా దారుణం అంటూ.ఉండగా మరికొందరైతే.
, ఇలాంటి వెధవల్ని కఠినంగా శిక్షించాలని స్పందిస్తున్నారు.