ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్ కు తెలంగాణ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరామని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ తో బీఆర్ఎస్ నేతలు దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు.ఈ క్రమంలో సూత్రధారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఎంపీ లక్ష్మణ్( MP Laxman ) అన్నారు.
బీఆర్ఎస్ నేతల అవినీతి, కుంభకోణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ వదిలిపెట్టినా తాము వదిలిపెట్టమని స్పష్టం చేశారు.