అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున( Nagarjuna ) ఒకప్పుడు చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.అయితే ఇదే క్రమం లో ఆయన మంచి సినిమాలను చేసి ప్రాసెస్ లో కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలను చేశాడు.
దానివల్ల ఆయన కెరియర్ అనేది చాలా వరకు సక్సెస్ ఫుల్ గా సాగలేదనే చెప్పాలి.ఇక హీరోగా ఆయనకు ఇమేజ్ వచ్చిన తర్వాత కొన్ని జానర్స్ లో సినిమాలు చేయకూడదు అని చాలా మంది చెప్పిన కూడా వినకుండా నాగార్జున అప్పట్లో ప్రయోగాత్మకమైన సినిమాలను ఎక్కువగా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.

కాబట్టి ఎక్స్పెరిమెంటల్ సినిమాలు( Experimental Movies ) చేస్తూ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుండేవాడు.ఇక ఇలాంటి క్రమంలోనే తను పెంచుకున్న మార్కెట్ అనేది సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల డౌన్ అయిపోతుంది.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చిరంజీవి( Chiranjeevi ) రేంజ్ కు వెళ్లలేకపోయాడు.అలాగే మాస్ హీరోగా కూడా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకోలేకపోయాడు.ఇక ఆయన మార్కెట్ అనేది పెరుగుతూ తగ్గుతూ రావడం వల్ల నాగార్జున హీరోగా ఇండస్ట్రీలో ఎదగలేకపోయాడని చాలామంది చెబుతూ ఉంటారు.

మరి నాగార్జున చేస్తున్న సినిమాల్లో కొన్ని సినిమాలు రొమాంటిక్ జానర్ లో ఉంటే మరికొన్ని సినిమాలు మాస్ యాక్షన్ జానర్ లో తెరకెక్కుతూ ఉంటాయి.ఇక మరికొన్ని సినిమాలు మాత్రం ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను అందుకునే విధంగా ముందుకు దూసుకెళ్తుంటాయి.ఇక ఇలాంటి క్రమం లోనే ఈయన చేసిన చాలా సినిమాలు సక్సెస్ లు సాధించినప్పటికీ ఆయన మార్కెట్ పెరగకపోవడం తో ఈయన మార్కెట్ ఎప్పుడు ఒకే విధంగా ఉంటూ వచ్చింది తప్ప మిగతా స్టార్ హీరోల మాదిరిగా హై లో మాత్రం లేకుండా పోయింది.
అందువల్లే ఆయన చిరంజీవి రేంజ్ లో సక్సెస్ అవ్వలేకపోయారని మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…
.







