అమెరికాలో బాల్టిమోర్‌లో వంతెనను( Baltimore Bridge ) సరకు రవాణా నౌక (కార్గో షిప్ ) ( Cargo Ship ) ఢీకొట్టడంతో బ్రిడ్జీ మొత్తం కుప్పకూలిన సంగతి తెలిసిందే.పటాప్‌స్కో నదిపై వున్న ప్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను సోమవారం అర్థరాత్రి దాటాక ఈ నౌక ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది.
ప్రమాద తీవ్రతకు సెకన్ల వ్యవధిలోనే వంతెన కుప్పకూలగా .ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న వాహనాలన్నీ నదిలో పడిపోయాయి.ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.మరోవైపు నౌకలోనూ మంటలు చెలరేగి , విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
కాగా.
కార్గో షిప్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది మొత్తం భారతీయులే.( Indians ) ప్రమాదం జరిగిన వెంటనే వారు స్పందించిన విధానంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( US President Joe Biden ) ప్రశంసించారు.
సింగపూర్ ఫ్లాగ్‌తో వెళ్తున్న సరుకు రవాణా నౌకను నిర్వహిస్తున్న షిప్పింగ్ కంపెనీ ‘‘సినర్జీ మారిటైమ్’’( Synergy Maritime ) గ్రూప్ మంగళవారం ఒక ప్రకటనలో ఓడలోని మొత్తం 22 మంది సభ్యుల సిబ్బంది భారతీయులేనని తెలిపింది.
ప్రమాదం తర్వాత వారు ఓడలోని సిబ్బంది మేరీల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను అప్రమత్తం చేశారు.సిబ్బంది ఓడపై నియంత్రణ కోల్పోయారని.ప్రమాదానికి ముందే వంతెనపై రాకపోకలను నిలిపివేయాల్సిందిగా స్థానిక అధికారాలను వారు అప్రమత్తం చేశారని బైడెన్ ప్రశంసించారు.
ఈ చర్య ఎన్నో ప్రాణాలను కాపాడిందని అధ్యక్షుడు పేర్కొన్నారు.ఇప్పటి వరకు దీనిని ప్రమాదంగానే చూస్తున్నామని.
ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని జో బైడెన్ చెప్పారు.
మరోవైపు.ప్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్( Francis Scott Key Bridge ) కూలిపోయిన ఘటనలో గల్లంతైన ఆరుగురు వ్యక్తులు చనిపోయినట్లుగా భావిస్తున్నట్లు మేరీలాండ్ స్టేట్ పోలీసులు ప్రకటించారు.ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో పటాప్‌స్కో నది( Patapsco River ) లోతు .గల్లంతైన తర్వాత గడిచిన సమయాన్ని బట్టి చూస్తే వారు జీవించి వుండే అవకాశాలు తక్కువేనని నిపుణులు చెబుతున్నారు.ఘటనాస్థలంలో ఎనిమిది మంది వ్యక్తులు వుండగా .వారిలో ఇద్దరు రక్షించబడ్డారని , మిగిలిన వారి కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బాల్టిమోర్ పోర్ట్ అమెరికాలోని అతిపెద్ద షిప్పింగ్ హబ్‌లలో ఒకటి అని బైడెన్ పేర్కొన్నారు.
గతేడాది ఇది రికార్డ్ స్థాయిలో కార్గోను నిర్వహించిందని .ఆటోమొబైల్స్ , లైట్ ట్రక్కులు దిగుమతులు, ఎగుమతులకు బాల్టిమోర్ అమెరికాలోనే అగ్రశ్రేణి నౌకాశ్రయమని అధ్యక్షుడు వివరించారు.ప్రతి ఏడాది 8,50,000 నౌకలు ఈ నౌకాశ్రయం గుండా రాకపోకలు సాగిస్తాయని బైడెన్ చెప్పారు.