Actress Pooja Dadwal : సల్మాన్‌ ఖాన్‌తో నటించిన హీరోయిన్.. ఇప్పుడు చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతోంది..!

సినిమా ఇండస్ట్రీ( Film Industry ) అనేది ఒక రంగుల ప్రపంచం.నిజానికి ఇదొక మాయా ప్రపంచం అని చెప్పుకోవచ్చు.

 Salman Khan Heroine Running Tiffin Center-TeluguStop.com

పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు చేసిన నటీనటులు ఆ తర్వాత అడ్రస్ లేకుండా కనుమరుగైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఒకప్పుడు వెండితెరపై తళుక్కుమని ఇప్పుడు అత్యంత దీనస్థితిలో, బతకడమే కష్టంగా బతుకుతున్న వారు కూడా ఉన్నారు.

అలాంటి హీరోయిన్లలో బాలీవుడ్‌ నటి పూజా దడ్వల్‌ ఒకరు.ఆమె 1994లో యమలీల సినిమా( Yamaleela )లో కృష్ణతో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో కూడా కనిపించింది.

అయితే ఆమె కెరీర్ కొంతకాలం కూడా సాగలేదు.ఈ నటి ప్రాణాంతక వ్యాధి అయిన క్షయ( Tuberculosis ) బారిన పడింది.

దాంతో భర్త ఆమెను ముంబైలో ఒంటరిగా వదిలిపెట్టి తన దారి తాను చూసుకున్నాడు.ఆదుకోవడానికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆమె చాలా విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంది.

ఈ తార 1995లో సల్మాన్ ఖాన్‌తో కలిసి వీర్గతి( Veergati ) అనే సినిమాలో చేసింది.పెద్ద హీరోతో నటించే అవకాశం అయితే వచ్చింది కానీ ఆ మూవీ సినిమా ఫ్లాప్ అయింది.

హీరోయిన్‌గా పూజ దడ్వల్‌( Pooja Dadwal )కు పేరొచ్చింది కానీ సినిమా వల్ల ఆమె కెరీర్‌కి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.

Telugu Actresspooja, Bollywood, Personal, Rajendra Singh, Salman Khan, Veergati-

1977లో ముంబైలో పుట్టిన పూజ అదే సిటీలో కాలేజీ దాకా చదువుకుంది.సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలనే కోరిక ఆమెకు ఎక్కువ.అందుకే చదువుకుంటూనే యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంది.

అదే సమయంలో ఆమెకు ఓ సినిమా ఆఫర్ వచ్చింది.అప్పటికి ఆమె వయసు దాదాపు 17 ఏళ్లు ఉంటాయి.

ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరో అని తెలిసి పూజ ఎగిరి గంతేసింది.కానీ సినిమా పెద్దగా ఆడలేదు.

దానివల్ల ఆమెకు మంచి అవకాశాలు( Movie Offers ) రాలేదు.వచ్చిన కొన్ని అవకాశాలు చేసినా గుర్తింపు దక్కలేదు.

పెద్దగా డబ్బులు కూడా రాలేదు.ఆమె చేసిన సినిమాలన్నీ అపజయాలు కావడంతో ఇండస్ట్రీ ఆమె గురించి పూర్తిగా మర్చిపోయింది.


Telugu Actresspooja, Bollywood, Personal, Rajendra Singh, Salman Khan, Veergati-

దాంతో చేసేది లేక బుల్లితెర ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.1999లో ఆషికి, 2001లో ఘరానా టీవీ సీరియళ్లలో నటించింది.బుల్లితెరపై మంచి గుర్తింపు వచ్చింది కానీ సినిమాల్లో నటించాలనే ఆమె ఆశ నెరవేరలేదు.అందుకే బుల్లితెర కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఏదైనా చేయాలనుకుంది.ఒక వ్యక్తి నచ్చడంతో అతడిని పెళ్లి చేసుకొని గోవాకు మాకాం మార్చింది.అతని క్యాసినో మేనేజ్ మెంట్‌లో తనకు సాధ్యమైన సహాయం చేసింది.

అలా జీవితం హ్యాపీగా కొనసాగుతున్న క్రమంలో 2018లో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది.ఆసుపత్రికి వెళ్తే క్షయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది.

దాంతో భర్త అత్తమామలు ఆమెను వదిలేసి వెళ్లిపోయారు.సహాయం కోసం కోరిన ఆమెకు నటుడు రాజేంద్ర సింగ్( Rajendra Singh ) తన వంతుగా సహాయం అందించాడు.

హీరో సల్మాన్ ఖాన్ కూడా ఆరు నెలల వరకు ఆమెకు అయ్యే ఖర్చును అంతా తానే భరించాడు.అయితే క్షయ వ్యాధి ఒకవైపు, పేదరికం మరోవైపు వల్ల ఆమె చాలా బక్క చిక్కిపోయింది.

చూసేందుకే కడుపు తరుక్కుపోయేంతలా ఎముకల పోగు అయ్యింది.ఆ ఫోటోలు కూడా వైరల్ అయి చాలామందిని కంటతడి పెట్టించాయి.కొంచెం రికవర్ అయ్యాక ఆమె మళ్ళీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టింది.2020లో శుక్రనా, గురునానక్ దేవ్‌జీ అనే పంజాబీ మూవీ చేసింది.అయితే అది ఫ్లాప్ కావడంతో మళ్లీ ఆమె ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది.అప్పుడు కూడా ఆ రాజేంద్రసింగే అండగా నిలబడ్డాడు.ఓ టిఫిన్ సర్వీస్ స్టార్ట్ చేయడానికి కావలసిన సామాగ్రిని డబ్బులను అందించాడు.ఇప్పుడు ఆమె అదే బతుకు తెరువుగా జీవితాన్ని నెట్టుకొస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube