టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో శ్రీనువైట్ల( Sreenu Vaitla ) ఒకరు.ఈయన ఒకప్పుడు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేస్తే బ్లాక్ బస్టర్ సినిమాలను సొంతం చేసుకున్నారు.
అయితే ఇటీవల కాలంలో శ్రీను వైట్లకు సరైన హిట్లు లేకపోవడంతో ఈయన ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు.ప్రస్తుతం గోపీచంద్ తో ఈయన ఒక సినిమా చేస్తున్నారు, కానీ బడ్జెట్ ఇష్యూ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది.
ఈ సినిమాకి తరచూ నిర్మాతలు మారుతూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీనువైట్ల వెంకీ ( Venky) సినిమా సీక్వెల్ చిత్రం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.రవితేజ ( Raviteja ) స్నేహ ( Sneha ) హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం వెంకీ ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలుసు. ముఖ్యంగా రవితేజ బ్రహ్మానందం మధ్య ట్రైన్ లో వచ్చే సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి.
ఇక ఈ సినిమా ఇటీవల రీ రిలీజ్ అవ్వడంతో భారీ స్పందన వచ్చింది.ఇలా ఈ సినిమాకు వచ్చే స్పందన చూసిన శ్రీనువైట్ల సీక్వెల్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.ఈ సినిమాకు ఎంతో మంచి క్రేజ్ వచ్చిందని అందుకే వెంకీ 2 ( Venky 2 )చేయాలనే ఆలోచనలో ఉన్నానని తెలిపారు.ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని ఈ సందర్భంగా శ్రీనువైట్ల వెల్లడించారు.
మరి సీక్వెల్ సినిమా వస్తే ఇందులో హీరోగా రవితేజ నటిస్తారా లేక ఎవరు నటిస్తారనే విషయాల గురించి తెలియాల్సి ఉంది.