సమ్మర్ సీజన్ ప్రారంభమవుతోంది.ఎండలు మెల్లమెల్లగా ఊపందుకుంటున్నాయి.
అయితే వేసవి కాలంలో విపరీతమైన ఎండలు మరియు వేడి కారణంగా స్కిన్ డ్రైవ్ అవ్వడం లేదా జిడ్డు జిడ్డుగా మారడం అవుతుంటుంది.అలాగే సన్ టాన్, స్కిన్ కలర్( Sun tan, skin color ) తగ్గిపోవడం వంటి ఎన్నో చర్మ సమస్యలు వేధిస్తుంటాయి.
పైగా ఈ వేసవి కాలంలో చెమట కారణంగా మేకప్ కూడా చాలా త్వరగా చెదిరిపోతుంటుంది.అందుకే సమ్మర్ సీజన్ లో స్కిన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
అయితే సమ్మర్ లోనూ చర్మాన్ని అందంగా మెరిపించడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.అందులో బెస్ట్ అండ్ సింపుల్ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ) ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్( Rice flour ) వేసుకోవాలి.
వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా ఫ్రెష్ కొబ్బరి నీళ్లు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన అనంతరం ఐస్ వాటర్( Ice water ) తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.సమ్మర్ లో ఈ సింపుల్ మాస్క్ చర్మానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ రెమెడీ టాన్ ను రిమూవ్ చేస్తుంది.స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.అలాగే ఈ రెమెడీ చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది.చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
చర్మాన్ని అందంగా మరియు ప్రకాశవంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.వేసవి కాలంలో రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ ఫేస్ మాస్క్ ను వేసుకున్నారంటే మేకప్ లేకపోయినా బ్యూటిఫుల్ గా మరియు షైనీ గా కనిపిస్తారు.