మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటి అనన్య నాగళ్ళ ( Ananya Nagalla )ఒకరు.ఈమె హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్( Vakeel Saab ) సినిమాలో కూడా ఈమె ఓ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత సక్సెస్ అందుకున్నారు.అయితే ఇటీవల ఈమె తంత్ర ( Tantra )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
హర్రర్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ల నిమిత్తం అనన్య నాగళ్ళ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేసిన సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే ఈమె జబర్దస్త్ కమెడియన్ రీతు చౌదరి ( Rithu Chowdary ) యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో విషయాలను వెల్లడించారు.
తాను సర్జరీ చేయించుకున్నానని హీరోయిన్లు గ్లామర్ షో చేసేది అవకాశాల కోసమే అన్నట్టు ఈమె పలు విషయాలను వెల్లడించారు.
ఇక రీతు చౌదరి ఈమెను ప్రశ్నిస్తూ మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎలాంటి అబ్బాయి మీకు భర్తగా రావాలి అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూతనకు కాబోయే భర్తకు కచ్చితంగా గడ్డం ఉండాలంట.ఇక ఎత్తు, కలర్, మనీ లాంటి విషయాలను పర్టిక్యులర్ ఏం లేదని చెప్పింది.
చూడగానే తనను ఇంప్రెస్ చేయగలిగితే చాలని సింపుల్ గా తనకు కాబోయే భర్త గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక కెరియర్ పరంగా అనన్య వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.