Chandrababu : చిలకలూరిపేట సభలో సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు..!!

చిలకలూరిపేటలో ప్రజాబలం పేరిట జనసేన- బీజేపీ – టీడీపీ ( Janasena-BJP-TDP )ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున రావటం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 Chandrababu Criticizes Cm Jagan In Chilakaluripet Assembly-TeluguStop.com

ఈ సందర్భంగా చంద్రబాబు( Chandrababu ) మాట్లాడుతూ సీఎం జగన్( CM Jagan ) పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.అమరావతిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు.

మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారని విమర్శించారు.తాము అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో 70% పోలవరం పూర్తి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసింది.

రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్స్ పేరుతో దోచేశారని ఆరోపించారు.జే బ్రాండ్ లిక్కర్ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి తన ఆదాయాన్ని పెంచుకున్న దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు.పెట్టుబడులు తరిమేశారు.ఐదేళ్లలో రోడ్లు లేవు.పరిశ్రమలు ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి లేదు.ప్రజలకు మనశ్శాంతి లేదు.

బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశారు.గతంలో ఎప్పుడు లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు.

రాష్ట్రం ఎన్నో ఇబ్బందులలో ఉంది.అందుకే ఈ పొత్తు.

దేశంలో ఎన్డిఏకి 400 ప్లస్ సీట్లు వస్తాయి ఏపీలో 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత మీదే అంటూ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube