మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు( Manchu Vishnu ) మొదటి సినిమాతోనే భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు.అయితే ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు ఒక్క సరైన సక్సెస్ కూడా లేకపోవడంతో ఆయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడం కష్టమవుతుంది.
ఇక ఇప్పుడు 150 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప సినిమాని( Kannappa Movie ) తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమా మీదనే ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు మోహన్ బాబు కి అదిరిపోయే హిట్లు ఇచ్చిన డైరెక్టర్ బి గోపాల్( Director B Gopal ) డీ సినిమా తర్వాత విష్ణు తో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు.
దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినప్పటికీ ఆ కథ మోహన్ బాబు కి ( Mohan Babu ) నచ్చకపోవడంతో ఆ సినిమా హోల్డ్ లో పడింది.ఇక దాంతో ఆ సినిమా అనేది స్టార్ట్ అవ్వలేదు.నిజానికి బి గోపాల్ ఒకప్పుడు మంచి సక్సెస్ లను అందించాడు.
కానీ యంగ్ హీరోలు అయిన ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలకు మాత్రం సక్సెస్ లను ఇవ్వలేకపోయాడు.దానివల్ల కూడా బి.గోపాల్ కి మోహన్ బాబు అవకాశం ఇవ్వలేదని కొంత మంది అంటూ ఉంటారు.ఇక ఏది ఏమైనప్పటికి విష్ణు కన్నప్ప సినిమాతో పాన్ ఇండియా లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
ఇక ఇప్పటికే మోసగాళ్లు అనే సినిమాతో పాన్ ఇండియా లో సినిమాను రిలీజ్ చేసినప్పటికీ అది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.దాంతో ఈ సినిమాతో అయినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…మరి అందులో భాగంగానే స్టార్ హీరోలందరిని ఈ సినిమాలో భాగం చేస్తున్నాడు…మరి ఈ సినిమాతో అయిన సక్సెస్ కొడతాడో లేదో చూడాలి…
.