Sesame Oil : నువ్వుల నూనెను రోజు నైట్ ముఖానికి ఇలా రాశారంటే చర్మం పై ఒక్క మచ్చ కూడా ఉండదు!

నువ్వుల నూనె( Sesame Oil )మనందరికీ అందుబాటులో ఉన్న అద్భుతమైన ఆయిల్స్ లో ఒకటి.నువ్వుల నుంచి తయారు చేయబడే నూనెను ప్రాచీన కాలం నుంచి వంటలకు వాడుతున్నారు.

 How To Use Sesame Oil For Spotless Skin-TeluguStop.com

అలాగే అనేక అనారోగ్య సమస్యల చికిత్సలో కూడా నువ్వుల నూనెను ఉపయోగిస్తుంటారు.మిగతా వాటితో పోలిస్తే నువ్వుల నూనె అత్యంత శ్రేష్టమైనది.

నువ్వుల నూనెలో ప్రోటీన్ తో పాటు అనేక రకాల విటమిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.అందువల్ల చాలా మంది వంటలకు నువ్వుల నూనె వాడుతుంటారు.

Telugu Tips, Dark Spots, Skin, Latest, Sesame Oil, Sesameoil, Skin Care, Skin Ca

అయితే ఆరోగ్య పరంగానే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా నువ్వుల నూనె సహాయపడుతుంది.మనలో ఎంతో మందికి ముఖ చర్మంపై ముదురు రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి.అవి ఎన్ని చేసినా కూడా ఓ పట్టాన వదిలిపెట్టవు.అలాంటివారికి నువ్వుల నూనె ఒక వరమనే చెప్పవచ్చు.నువ్వుల నూనెను రోజు నైట్ ఇప్పుడు చెప్పబోయే విధంగా ముఖానికి రాశారంటే చర్మం పై ఒక్క మచ్చ కూడా ఉండదు.

Telugu Tips, Dark Spots, Skin, Latest, Sesame Oil, Sesameoil, Skin Care, Skin Ca

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ) వేసి రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నైట్ నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసుకుని చేతి వేళ్ళతో కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.నువ్వుల నూనెలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ సమృద్ధిగా ఉన్నాయి.

ఇవి మచ్చలకు వ్యతిరేకంగా పోరాడతాయి.చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్నా వాటిని క్రమంగా మాయం చేస్తాయి.

పిగ్మెంటేషన్ సమస్యను సైతం దూరం చేస్తాయి.అలాగే నువ్వుల నూనె చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.ముడతలు ఏమైనా ఉంటే మటుమాయం చేస్తుంది.

అలోవెరా జెల్‌ స్కిన్ ను హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.మరియు చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది.

కాబట్టి మచ్చలేని మెరిసే యవ్వనమైన చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని రెగ్యులర్ గా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube