Old Couple Love : భార్య ఫొటో తీసుకోవడానికి ఈ వృద్ధుడు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఫిదా..

వృద్ధ వయసులో డేటింగ్ చేస్తున్న ఓ జంట తాజాగా ఆన్లైన్లో వైరల్గా మారింది.వీరి హార్ట్ టచింగ్ రిలేషన్షిప్ చాలా మంది హృదయాలను గెలుచుకుంటోంది.

 Elderly Man Adorable Attempt To Capture Perfect Photo Of Wife-TeluguStop.com

వృద్ధ భర్త తన డేట్ను చక్కగా ఫోటో తీయడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడో చూపించే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.నిజానికి ఈ ఓల్డ్ కపుల్( Old Couple ) కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ ప్రత్యక్షమైంది కానీ ఆ తర్వాత అది డిలీట్ అయింది.

ఆ వీడియోలో భర్త తన సీటులో నుంచి లేచి టేబుల్ చుట్టూ తిరుగుతున్నాడు.

అతను ఫోటో పాడు కాకుండా వస్తువుల తీసేసి టేబుల్ను కూడా క్లియర్ చేస్తాడు.భార్య అతనిని చూసి నవ్వుతుంది, ఆపై ఆమె ఆహారంతో పోజులిచ్చింది.వీడియో ఎవరు తీశారో, ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.

ఈ జంట మధుర క్షణాన్ని ఎవరో రహస్యంగా రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే, అపరిచితుల వీడియోలను వారి అనుమతి లేకుండా రికార్డ్ చేయడాన్ని అందరూ ఇష్టపడరు.

ఇది గోప్యత ఉల్లంఘన అని కొందరు నెటిజన్లు భావించారు.అందుకే ఇన్స్టాగ్రామ్ పేజీ దీనిని డిలీట్ చేసింది.

డిలీట్ చేయడానికి ముందు ఈ వీడియోకు విపరీతమైన లైక్లు, కామెంట్లు వచ్చాయి.ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి “దంపతులు కలిసి ఫోటో దిగేందుకు సహాయం చేయాలనుకుంటున్నట్లు” క్యాప్షన్ ఇచ్చారు.పెద్దయ్యాక ఇలాంటి లవ్ స్టోరీ నడపాలని కోరుకుంటున్నట్టు వీడియో చూసినవారు వ్యాఖ్యానించారు.వీడియో( Viral Video ) తీసిన వ్యక్తే ఈ జంటను కలిపి ఫోటో తీస్తే బాగుండేది కదా అని మరి కొంతమంది అభిప్రాయపడ్డారు.

ఈ వృద్ధ జంట బతికినంత కాలం సంతోషంగా ఉండాలని ఒక యూజర్ ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube