నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ) గారు అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలాల చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం… ఇక దానికి తోడుగా ఆయన తెలుగుదేశం అనే పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఎం గా వ్యవహరించాడు.
ఇక ఇదిలా ఉంటే ఆయన నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఆయన తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) వచ్చాడు.
అయితే ఎన్టీఆర్ హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు.ఇక ఆయన సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే ఆయన ఏ విషయం నైనా చాలా డెడికేషన్ తో చేస్తాడు.
ముఖ్యంగా ఎన్టీఆర్ డాన్సులు( NTR Dance ) చేయడంలో దిట్ట, అలాగే ఫైటింగ్ లు గాని, యాక్టింగ్ గాని కసితో చేస్తూ ఉంటాడు.అందువల్లే ఆయన చేసిన మొదటి రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరో రేంజ్ ను అధిరోహించాడు అంటే మామూలు విషయం కాదు.అందుకే మిగిలిన నట వారసుల కంటే కూడా ఎన్టీఆర్ ఉన్నత స్థాయిలో ఉన్నాడనే చెప్పాలి.ఇక నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) నుంచి వచ్చిన కొంతమంది హీరోలు సక్సెస్ కాకపోవడానికి ఆయన మాత్రమే సక్సెస్ అవ్వడానికి పైన చెప్పిన వాటిని ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.
ఇక ఈయన హార్డ్ వర్క్ చూసి చాలామంది తన లాగే ఎక్కువ కష్టపడి మరి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ల లో దేవర( Devara ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్నింటినీ బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.ఇక తొందర్లోనే ఈ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు…
.