మలయాళ ఇండస్ట్రీ మెగా హీరో మమ్ముట్టి( Mammootty ) పట్టువదలని విక్రమార్కుడు లాంటివాడు.ఎందుకంటే వందల కొద్ది సినిమాలు ఈ వయసులో తీయడం ఆయనకు మాత్రమే సాధ్యం.70 ఏళ్ల వయసులో ఎవరైనా ఇంత కుర్రాడిలా కనిపిస్తారా ? కానీ మమ్ముట్టి కొడుకుకి మంచి సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలో దూసుకుపోతున్నాడు.ఇక ప్రయోగాత్మక చిత్రాలకు కూడా ఆయన పెట్టింది పేరు.
మరో విషయం ఏమిటి అంటే ఆయన తీసిన ప్రతి ప్రయోగాత్మక చిత్రాలకు తానే ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు.పైగా కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము దులుపుతున్నాయి మమ్ముకా సినిమాలు.2024 సంవత్సరం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు.ఇప్పటికె రెండు సినిమాలు విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి.
తాజాగా ఆయన నటించిన బ్రమయుగం సినిమా( Bramayugam ) మంచి కలెక్షన్స్ రాబడుతుంది.అది ఇంకా థియేటర్లో ఉండగానే మరో సినిమాతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసాడు మమ్ముట్టి.ఈ సినిమా కోసం చాలా తక్కువ పెట్టుబడి పెట్టగా కానీ 50 కోట్లకు పైగా వసూలు సాధించింది.ఇక ఇప్పుడు టర్బో అని మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
దీనికి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది.మార్చి నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మమ్ముట్టి భావిస్తున్నాడట.
సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొద్దిగా మాత్రమే బ్యాలెన్స్ ఉండడంతో కచ్చితంగా మార్చి చివరి వారంలో విడుదల అవుతుంది అని అంతా అనుకుంటున్నారు.
ఇక టర్బో సినిమా మమ్ముట్టి స్వయంగా నిర్మాతగా మారి తీస్తున్న చిత్రం కావడం విశేషం.ఈ సినిమా అలా విడుదల అవుతుందో లేదో కడుగన్నావా ఓరు యాత్ర( Kadugannawa Oru Yathra ) అనే మరో సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు మమ్ముట్టి టీం.ఈ సినిమా పూర్తవగానే బజూకా( Bazooka ) అనే మరో సినిమా కూడా పోస్టు ప్రొడక్షన్లో ఉంది కాబట్టి దాన్ని కూడా వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారట.ఇలా ఆరు నెలల్లో ఆరు సినిమాలు విడుదల చేయడం అనేది కేవలం మమ్ముట్టికి మాత్రమే సాధ్యమవుతుంది.ఆయన చిత్రాలు విజయాలను సాధించడంతో పాటు ఎక్కువ సినిమాలను ఆయన విడుదల చేయడం అనేది చాలా గొప్ప విషయం.