Sri Erukumamba Temple : అక్కడ అమ్మవారికి శిరస్సు ఉండదు.. పసుపు నీళ్లు పోస్తే కోరిన కోరికలు తీరతాయట.. ఎక్కడంటే?

సాధారణంగా ఏ అమ్మవారి దేవాలయానికి వెళ్లినా అమ్మవారి పూర్తి రూపం ఉంటుందనే సంగతి తెలిసిందే.అయితే ఒక ఆలయంలో మాత్రం అమ్మవారి పాదాల దగ్గర శిరస్సు ఉంటుంది.

 Interesting Facts About Goddess Sri Erukumamba In Telugu-TeluguStop.com

ఈ ఆలయంలో అమ్మవారి శిరస్సు స్థానంలో ఓంకారం( Omkaram ) ఉంటుంది.విశాఖపట్నంలోని( Vishakapatnam ) దొండపర్తిలో ఈ ఆలయం ఉండగా ఇక్కడ వెలసిన శ్రీ ఎరుకుమాంబ అమ్మవారిని( Sri Erukumamba Ammavaru ) భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

ఇక్కడి అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తులు బలంగా నమ్ముతారు.మూడు బిందెలతో పసుపు నీళ్లు( Turmeric Water ) పోయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని భక్తులు చెబుతున్నారు.

ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలకు ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ ఆలయాన్ని ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.

Telugu Devotees, Dondahy, Sri Erukumamba, Srierukumamba, Temple, Turmeric, Visha

ఈ ఆలయంలో అమ్మవారిని గౌరీ స్వరూపం అని భావిస్తారు.ఇక్కడ అమ్మవారు కలలో కనిపించి భక్తులకు తనకు శిరస్సు లేకుండా పూజలు చేయాలని సూచించడం గమనార్హం.కలియుగంలో ప్రజల సంక్షేమాన్ని కోరుకునే దేవతలలో శ్రీ ఎరుకుమాంబ దేవత ఒకరని భక్తులు ఫీలవుతారు.పెళ్లి కాని వాళ్లు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే త్వరగా వ్యాధులు నయమవుతాయి.

Telugu Devotees, Dondahy, Sri Erukumamba, Srierukumamba, Temple, Turmeric, Visha

ప్రతి బుధవారం రోజున ఈ ఆలయంలో స్నాన ఘట్టాల పూజను గ్రాండ్ గా నిర్వహిస్తారు.ప్రతి నెలా మూడో గురువారం రోజున ఈ ఆలయం దగ్గర అన్నదానం నిర్వహిస్తారని సమాచారం అందుతోంది.బస్సు, రైలు మార్గాల ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా దర్శించునే అవకాశం ఉంటుంది.ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.అక్కయ్యపాలెంకు సమీపంలో ఉన్నవాళ్లు ఈ ఆలయాన్ని సులువుగా దర్శించుకునే అవకాశం ఉంటుంది.ఒకప్పుడు ఈ ఆలయం వేరేచోట ఉండేదని రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఈ ఆలయం మారిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube