Bull: అనుకోని అతిథి కారణంగా ఆగిపోయిన క్రికెట్ మ్యాచ్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.ఎప్పుడూ జరిగే క్రికెట్ మ్యాచ్( cricket match ) ఏ కదా అందులో ఫన్నీ ఏముంది అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను మనం గమనించినట్లయితే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న మైదానంలోకి ఒక ఎద్దు వచ్చింది.అది నేరుగా వికెట్ల వైపుకు రావడం మనం చూడొచ్చు.

 Laughter Video Of Cricket Match Stopped Due To Unexpected Guest-TeluguStop.com

ముందుగా వికెట్ కీపర్ వైపు ఆ ఎద్దు వెళ్లింది.అది చూసిన వికెట్ కీపర్ వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టాడు.

దీని తరువాత స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ తన బ్యాట్‌ను చూపిస్తూ ఎద్దును( bull ) తరిమికొట్టడానికి ప్రయత్నించాడు.ఎద్దుకు కోపం వచ్చి ఆ బ్యాటర్ పైకి దూసుకెళ్లింది.ఆ తరువాత అంపైర్, బౌలర్ వైపు ఎద్దు దూసుకెళ్లడంతో ఇద్దరూ మైదానం నుంచి పరుగుగెత్తుతూ బయటకు వెళ్లిపోయారు.ఆ ఎద్దుని భయపెట్ట బోయి ప్లేయర్స్‌యే జడుసుకొని గ్రౌండ్ నుంచి తయారయ్యారు.

ఈ ఎద్దు కారణంగా మ్యాచ్ ఆగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫన్నీ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందనేది క్లారిటీ లేదు కానీ వీడియోలో కనిపిస్తున్న వాతావరణాన్ని బట్టి అది ఓ గ్రామంలో జరిగిన ఘటన అని అర్థమవుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.కొంతమందేమో ‘ఎద్దు కూడా క్రికెట్ ఆడేందుకు వచ్చిందేమో’ అని కామెంట్స్ చేస్తే, మరికొందరేమో ‘ఎద్దుని తరిమేద్దాం అనుకుని మీరు పారిపోయారేంటి బయ్యా’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్ వేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube