టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ మంగ్లీ( Singer Mangli ) ఒకరు.ఈమె కెరియర్ మొదట్లో ఫోక్ సింగర్ గా ఎన్నో పాటలు పాడుతూ వీడియోలు చేసేవారు.
ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలో ఏదైనా ముఖ్యమైన పండుగలు వస్తే స్వయంగా మంగ్లీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసేవారు ఇలా ఈ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి మంగ్లీ ప్రస్తుతం ప్లే బ్యాక్ సింగర్( Play Back Singer ) గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఈమె కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కన్నడ తమిళ హిందీ భాషలలో కూడా పాటలు పాడుతూ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె ఇటీవల బుల్లితెర సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి సూపర్ సింగర్( Super Singer ) కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే ఒకప్పుడు ఎంతో పద్ధతిగా కనిపించే మంగ్లీ ఇటీవల కాలంలో కాస్త గ్లామర్ షోకి తెర తీశారు.ఈ క్రమంలోనే మంగ్లీ పెద్ద ఎత్తున వివిధ రకాల ట్రెండీ వేర్( Trendy Wear ) ధరిస్తూ హాట్ ఫోటోలు ఇస్తూ ఉంటారు.తాజాగా ఎరుపు రంగు డ్రెస్సులో ఈమె అందాలన్నింటినీ ఆరబోస్తూ అందాల ప్రదర్శన చేశారు.ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ ఫోటోలపై విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో మంగ్లీ( Mangli ) చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం మీకు కూడా ఇండస్ట్రీ నీళ్లు బాగా ఒంటబట్టినట్లు ఉన్నాయి అందుకే ఇలా గ్లామర్ షో చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక చాలామంది ఈమె శరీర బరువు గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు.ఇక మంగ్లీ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా తన టాలెంట్ తో సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సెలెబ్రెటీగా మారిపోయారు.మంగ్లీ అనంతపురం జిల్లాకు చెందిన అమ్మాయి తన అసలు పేరు సత్యవతి రాథోడ్( Satyavati Rathode ) ఇండస్ట్రీలోకి సింగర్ గా రావడంతో ఈమె మంగ్లిగా మారిపోయారు.
ఇక ఈమె సోదరీ చంద్రావతి చౌహన్ కూడా సింగర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.