సాధారణంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్( Music Director ) కథ మొత్తం పూర్తిగా వింటేనే ఆ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించగలరు.ఎక్కడ ఎమోషన్స్ సీన్స్ ఉంటాయి, ఏ సందర్భంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ అవసరం పడుతుంది, ఎలాంటి పాటలను కంపోజ్ చేయాలి, వాటికి తగ్గ మ్యూజిక్ ఎలా ఇవ్వాలి అనేది ఆ కథను పట్టే ఉంటుంది.
మరి అలా ఒక డైరెక్టర్ పూర్తి కథను సంగీత దర్శకుడికి చెప్తే తప్ప మంచి ఔట్పుట్ రాదు .హీరోకి హీరోయిన్ కి స్టోరీ సగం చెప్పిన సరిపోతుంది కానీ సంగీత దర్శకుడికి మాత్రం పూర్తిస్థాయిలో కథను వినిపించి తీరాల్సిందే.అప్పుడే సినిమాకు ప్రాణం పొసే సంగీతం వస్తుంది.అలాంటి సంగీతం ప్రజల నోళ్లలో ఎప్పుడూ నానుతూ ఉంటుంది.
ఎవరికైనా కూడా ఒక కథ పూర్తిగా వినాలంటే దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.అలా వినే ఓపిక ఉంటేనే మంచి సంగీతం వస్తుంది అని దర్శకుడు కూడా ఫీలవుతాడు.కానీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న దర్శకుడు అనిరుద్( Anirudh Ravichandran ) ఒక కథను వినాలంటే చాలా బోర్ ఫీల్ అవుతాడట.పూర్తి కథ వినాలంటే తన వల్ల కాదు కాదట.
కాసేపటికి నీరసం వచ్చేసిన ఫీలింగ్ వస్తుందట.మరి కథ వినకుండా సంగీతం ఎలా ఇస్తారు అంటే మొత్తం కథను( Movie Story ) గంట సమయంలోనే చెప్పగలిగితే నే ఆ సినిమాకి సంగీతం కొట్టగలడు అనిరుద్ రవిచంద్రన్.
నాలుగు గంటల కథ వినాలంటే నాతో కాదు కేవలం గంట సమయం ఇస్తాను కథ చెప్పి వెళ్లిపోండి.మీకు కావాల్సిన సంగీతం ఇస్తానని ముందే డైరెక్టర్స్ కి కండిషన్ పెడతాడట.
అలా గంటకు మించి ఇంత వరకు ఏ సినిమా కథను వినలేదట.కేవలం గంట సమయం మాత్రమే కథ విని అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు.ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.బ్యాగ్రౌండ్ స్కోర్ అంటే అనిరుద్( Anirudh ) అనే మారుపేరు వచ్చేలా అతని పేరు మారుమ్రోగుతుంది.
మరి గంటకే ఇలాంటి సంగీతం ఇస్తున్నాడు అంటే తప్పని పరిస్థితులలో ఎప్పుడైనా మూడు నుంచి నాలుగు గంటలు పూర్తి కథను దర్శకుడు వినిపిస్తే ఇంకా ఎలాంటి సంగీతం బయటకు వస్తుందో చెప్పాల్సిన అవసరం ఏముంది.